దేశం వీడి వెళ్లాలని లాడెన్‌కు సలహా
కాబూల్: దేశం విడిచి వెళ్లాల్సిందిగా అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్‌కు సూచించాల్సిందిగా ఉలేమాలు తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్‌కు సలహా ఇచ్చారు. రెండు రోజుల షురా సమావేశం గురువారం ముగిసింది.
అయితే, లాడెన్ దేశం విడిచి వెళ్లడానికి తగిన గడువేదీ ఉలేమాలు సూచించలేదు. లాడెన్‌ను అమెరికాకుఅప్పగించే ఏ చర్యను కూడా తాము సమర్థించబోమని ఉలేమాలు స్పష్టం చేశారు.
లాడెన్ తనంత తానుగా దేశం విడిచి వెళ్లిపోయి, మరో చోటు చూసుకోగలడనే ఆశాభావాన్ని మతపెద్దల మండలి షురా ఆకాంక్షించింది. అయితే దేశం విడిచి వెళ్లిపోవాలని లాడెన్‌పై ఒత్తిడి తేవద్దని నిర్ణయించింది.
గాయపడిన, మృతి చెందిన, జాడ తెలియని భారతీయుల సన్నిహిత బంధువులకు తత్కాల్ ఛార్జీలు లేకుండా పాస్‌పోర్టులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలుఅందాయి. న్యూయార్క్ నగర అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన కుటుంబ సహాయ కేంద్రంతో న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications