కోర్టుకెక్కునున్న కాకర్ల
హైదరాబాద్: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలమీద కోర్టును ఆశ్రయిస్తానని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు చెప్పారు. కాకర్ల సుబ్బారావుఅవినీతికి పాల్పడినట్లు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి ఆరోపించినవిషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదనే ఆధారాలున్నాయని సుబ్బారావు ఆదివారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.
కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగానే నిమ్స్‌పై దుమారం రేపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మెడికల్ షాపు యజమాని, తనపర్సనల్ అసిస్టెంట్ ఇళ్లపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు జరపారని, ఆ దాడుల్లో ఏమీ బయట పడలేదని ఆయన చెప్పారు. ఈవిషయమై తాను రహస్యంగా విచారణ కూడా జరిపించానని, ఈవిచారణలో దోషులు ఎవరైనా బయట పడితే వారిపై చర్య తీసుకుంటానని ఆయన చెప్పారు. మెడికల్ షాపు యజమాని తన విదేశీ పర్యటనకు ఎయిర్ టికెట్లు తీసిచ్చారనే ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. వచ్చిన ఆరోపణలను దృష్టిలోపెట్టుకుని కొంత మందిని బదిలీ కూడా చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications