భారత్, పాక్‌లపై ఆంక్షల ఎత్తివేత
వాషింగ్టన్: పాకిస్థాన్, భారతదేశాలపై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అణుపరీక్షలు జరపడంతో 1998లో పాకిస్థాన్, భారత్‌లపై విధించిన ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ ఆదివారంనాడు ఎత్తివేశారు. ఆంక్షల ఎత్తివేత వల్ల జాతీయ భద్రతకు ఏ విధమైన ముప్పు వాటిల్లదని ఆయన అన్నారు.
భారత్ పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన వెంటనే పాకిస్థాన్ పోటీగా తాను అణు పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌లపై అమెరికా ఆర్థిక,సైనిక ఆంక్షలు విధించింది.
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై, పెంటగాన్‌పై టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత అమెరికా తలపెట్టిన తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్‌పై ఆంక్షలను అమెరికా ఎత్తివేసినట్లు భావిస్తున్నారు.
భారత్ విషయానికి వస్తే చాలా వరకు క్లింటన్ ప్రభుత్వమే ఆంక్షలను తొలగిస్తూ వచ్చింది. పాకిస్థాన్, భారత్‌లపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్‌కు బుష్ చెప్పి ఈవిషయాన్ని సంబంధిత కాంగ్రెస్ కమిటీలకు తెలియజేసి, ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించేలా చూడాలని బుష్ సూచించారు.












Click it and Unblock the Notifications