ఆంక్షల ఎత్తివేత చిన్నవిషయమే: సిన్హా
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్‌లపై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేయడాన్ని భారత ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా ఆహ్వానించారు. అయితే ఆంక్షల ఎత్తివేత అనేది అత్యంత ప్రాముఖ్యమైనఅంశమేమీ కాదని ఆయన ఆదివారంనాడిక్కడ అన్నారు.
ఆంక్షలు ఎత్తివేయడం మంచి పరిణామమని, అయితే, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది చాలా చిన్నవిషయమని ఆయన పటిఐ వార్తా సంస్థతో అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థనే తీసుకుంటే ఆంక్షల ప్రభావంపెద్దగా లేదని, ఆంక్షలు కొంత మేరకు రక్షణ సరఫరాలకు మాత్రమే పరిమితమయ్యాయని ఆయన అన్నారు. తీవ్రవాద వ్యతిరేక పోరులో భారత్, పాక్‌లు ప్రముఖ పాత్ర పోషించగలవనే ఉద్దేశంతో అమెరికా ఈ ఆంక్షలను ఎత్తివేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications