భారత్‌ సహాయం తొందరపాటు చర్య

బెంగుళూర్‌: అమెరికాకు సహాయంఅందిస్తామని భారత ప్రభుత్వం చేసిన ప్రకటన అత్యంత తొందరపాటుతో కూడుకున్నదని మాజీ విదేశాంగ కార్యదర్శిఎ.పి. వెంకటేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికాలో దాడుల అనంతరం అమెరికా తీవ్రవాదులపై ప్రకటించిన పోరుకు సహకరిస్తామని భారత్‌ ప్రకటించడం అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకోవడమేనని ఆయన అన్నారు. సిటిజన్స్‌ ఫోరమ్‌ ఏర్పాటు చేసిన సభలో అమెరికాలోని ఇటీవలి పరిణామాలు- భారత్‌పై భవిష్యత్తు ప్రభావం అనేఅంశంపై ఆయన ప్రసంగించారు.

చైనాలో భారత దౌత్యవేత్తగా కూడా పని చేసిన వెంకటేశ్వరన్‌ భారత చర్యనువిమర్శించారు. అమెరికా అడగకుండానే సహాయం చేస్తామని ప్రకటించాల్సిన అవసరం భారత్‌ ఏం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మన ప్రయోజనాల గురించి ఆలోచించకుండానే భారత్‌ సహాయం చేయడానికి ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.

మనకు వ్యతిరేకంగా జరుగుతున్న తీవ్రవాదాన్ని అమెరికా ఏ రోజు కూడా పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు. భారత్‌ సానుభూతి వ్యక్తం చేసి మద్దతు ప్రకటించి వుంటే సరిపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాకు సహాయం ప్రకటించడం భారత ప్రజల కోసం చేసింది కాదని ఆయన అన్నారు. భారత సహాయం చేస్తామని చేసిన ప్రకటనకు అమెరికా నుంచి ప్రతిస్పందన కూడా లేదని, దీన్ని పరిగణనలోకి కూడా తీసుకోలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+