వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీపై దాడిః23 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ః జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు సోమవారం నాడు అసాధారణ రీతిలో ఏకంగా అసెంబ్లీపైనే దాడి జరిపారు. ఈ దాడిలో సుమారు23 మందికి పైగా మరణించినట్టుగా సోమవారం రాత్రి అధికారులు ప్రకటించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్న కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వున్నదని కూడా అంటున్నారు.

భారీ బందోబస్తుతో చీమచిటుక్కుమన్నా అప్రమత్తమయ్యే సాయుధ జవాన్ల పహరాలో వుండేఅసెంబ్లీపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దళాలు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా బాంబులు, గ్రెనేడ్లు, తుపాకులతో విరుచుకుపడ్డాయి. ముందుగాఅసెంబ్లీ ప్రధాన ద్వారం ముందు తీవ్రవాదులు కారు బాంబును ప్రయోగించారు. ఈ బాంబు పేలుడుతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం చెలరేగింది.

ఈ గందరగోళాన్ని భయాందోళనలు ఆసరాగా చేసుకుని ఆ వెనుకనే సాయుధ ఉగ్రవాదులు బాంబులు రువ్వుతూ, కాల్పులు జరుపుతూ మెరుపువేగంతోఅసెంబ్లీలోకి చొరబడ్డారు. భీకరమైన శబ్దాలు,అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా క్షణాల్లో మరుభూమిగా మారింది. వెంటనే అప్రమత్తమైనసైనికదళాలు అసెంబ్లీ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ భీకర ఘర్షణల్లో మరణించిన వారిలో సైనికాధికారులు, పోలీసులతో పాటుఅసెంబ్లీ సిబ్బంది, ఒక స్కూల్‌ విద్యార్ధిని మరో పౌరుడు వున్నట్టుగా అధికారులు చెప్పారు.

తీవ్రంగా గాయపడిన మరో 40 మందిని వేరువేరు ఆస్పత్రులకు తరలించారు. ఉగ్రవాదులు దాడి జరిపిన సమయంలోఅసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే అదృష్టవశాత్తు దాడికి కొద్ది క్షణాల ముందే ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, మంత్రులు, ఎమ్మెల్యేలు భోజనవిరామంకోసం బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీలోని తమ కార్యాలయంలోనే వుండిపోయినస్పీకర్‌ను భద్రతాసిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. కాగాఅసెంబ్లీలోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఇద్దరినిసైనికులు కాల్చిచంపారు.

పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్‌ ఇ మహమ్మద్‌ ఈ దాడికి తామే కారణమని ప్రకటించింది. తమ పార్టీ కార్యకర్త వాజహత్‌ హుస్సెన్‌ టాటాసుమోలో వెళ్లికారుబాంబును అసెంబ్లీ ఎదుట పేల్చివేశారని జైష్‌ ఇ మహమ్మద్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 1999లో పాకిస్తాన్‌ టెర్రరిస్టులు ఇండియన్‌ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి విడుదల చేయించుకున్న మౌలానా మసూద్‌ అజార్‌ ఈ జెఇఎమ్‌ నేతగా వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X