షాకింగ్: పబ్లిక్ లో మహిళా ఎమ్మెల్యేపై ..! వీడియో వైరల్
ఇటీవల కేరళలో ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే ఎల్డీఎఫ్ 35 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక ఎన్డీఏ కూటమి 3 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఇక చాలా ఏళ్ల తర్వాత కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత చెరియన్ ఫిలిప్.. కొల్లాం నియోజకవర్గం మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణ పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో తాజాగా నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే బిందు కృష్ణ ఈ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్న మీడియా ఆమెను కొన్ని ప్రశ్నలు వేయగా వాటికి సమాధానం చెప్పేందుకు ఆమె అక్కడే మీడియాతో మాట్లాడుతుండగా సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ అక్కడకు వచ్చారు. దాంతో ఆమె మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాపగా.. చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి యత్నించారు.
ఇది గమనించిన ఎమ్మెల్యే బిందు కృష్ణ వెంటనే అప్రమత్తమై ఆయన్ను వెనక్కి తోసివేస్తూ పక్కకు తప్పుకున్నారు. ఆమెకు ఇష్టం లేదని స్పష్టంగా అర్థం అవుతున్నా చెరియన్ ఫిలిప్ మరోసారి ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆమె అసహనానికి గురై.. రెండు చేతులు ఓడించి నమస్కరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలా చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతోంది. కేరళ సీఎం ఎవరనేదానిపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications