వయసుతో నాకేం పని? బాలయ్యపై మనసు పారేసుకున్న బాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్తతో నిలుస్తూనే ఉంటుంది. గతేడాది నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమాలోని 'దబిడి దిబిడి' సాంగ్‌లో నటించిన ఊర్వశి.. ఆ సమయంలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. తనకంటే 33 ఏళ్లు పెద్దవాడైన బాలయ్యతో రొమాన్స్ చేయడం, అందులోని డాన్స్ స్టెప్స్ వింతగా ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా విమర్శలు గుప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి ఈ వివాదాలపై స్పందించి బాలయ్యకు మద్దతుగా నిలిచింది.

బాలయ్యతో పని చేయడం నా అదృష్టం
నందమూరి బాలకృష్ణ వంటి లెజెండరీ నటుడితో పని చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఊర్వశి వెల్లడించింది. సెట్స్‌లో ఆయనతో గడిపిన సమయం ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొంది. ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. "ఒక చిన్న విషయాన్ని పట్టుకుని దానిని పెద్దది చేసి చూపిస్తారు. కానీ ఆయనతో పని చేయడం మాత్రం చాలా సరదాగా సాగింది. కేవలం పాట మాత్రమే కాదు, సినిమాలో మా మధ్య వచ్చే యాక్షన్ సీన్లు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి" అని వివరించింది.

Urvashi Rautela on Romancing Balakrishna Says Age Gap Doesn t Matter He s Like a Child at Heart

ఆయన స్టైల్ అంటే నాకు ఇష్టం
బాలయ్యకు ఉన్న ప్రత్యేకమైన మేనరిజమ్స్, ఈవెంట్లలో ఆయన మైక్ లేదా ఫోన్ గాల్లోకి ఎగరవేయడం వంటి స్టైల్స్ గురించి ఊర్వశి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "ఆయనకు సంబంధించిన ఎన్నో వీడియోలను నేను ఇదివరకే చూశాను. ఆయన చేసే పనులు చూడటానికి చాలా సరదాగా ఉంటాయి. అభిమానులు కూడా ఆయనను ఆ స్టైల్స్ కోసమే ఎక్కువగా ఇష్టపడతారు" అని ఊర్వశి చెప్పుకొచ్చింది. బాలయ్య కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, లోపల ఆయన ఒక పిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడింది.

వ్యాలెంటైన్స్ డే విష్ చేసిన ఫస్ట్ పర్సన్ ఆయనే!
బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి చెబుతూ ఊర్వశి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. గతేడాది తనకు వ్యాలెంటైన్స్ డే నాడు మొదటిసారి విష్ చేసింది బాలయ్యే అని ఆమె వెల్లడించింది. ఆయన చాలా సరదాగా ఉంటారని.. ఎప్పుడూ కోపంగా ఉంటారనేది అపోహ మాత్రమేనని కొట్టిపారేసింది. సాధారణంగా ఉండే మనుషుల కంటే ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని, ముఖ్యంగా చిన్నపిల్లలతో ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడతారని ఊర్వశి రౌటెలా ఆ ఇంటర్వ్యూలో వివరించింది.

మే 22న విడుదల కానున్న సినిమా
నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉర్వశి రౌటెలా కేవలం గ్లామర్ కోసమే కాకుండా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా నటించిందని తెలుస్తోంది. మే 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. వయసు వ్యత్యాసంపై వస్తున్న ట్రోలింగ్‌ను పక్కన పెట్టి, కేవలం సినిమా పరంగా చూస్తే తమ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుందని ఊర్వశి ధీమా వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+