గతం మర్చిపోయారా.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు పై విశాల్ సంచలనం..!!

తమిళనాడు రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. 108 సీట్లు వచ్చినా.. విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా అవకాశం దక్కటం లేదు. కాంగ్రెస్ నుంచి నలుగురు సభ్యుల మద్దతుతో 112 స్థానాల సపోర్ట్ ఉన్న విజయ్ కు ఇంకా ఆరుగురు మద్దతు అవసరం. ఆ మొత్తం 118 కి మద్దతు ఇచ్చే వారి సంఖ్య పై స్పష్టత వచ్చిన తరువాతనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తేల్చి చెబుతున్నారు. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశం పైన హీరో విశాల్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు లో కొత్త ట్విస్టులు చోటు చసుకుంటున్నాయి. తాజా పరిణామాల పైన హీరో విశాల్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ ఇప్పటికీ విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. విశాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. 2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటకలో జరిగిన పరిణామాలను విశాల్ గుర్తు చేశారు. అప్పట్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి, తర్వాత అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.

విజయ్ కు ఊహించని మద్దతు, మారుతున్న లెక్కలు- ఇక నెక్స్ట్..!!
విజయ్ కు ఊహించని మద్దతు, మారుతున్న లెక్కలు- ఇక నెక్స్ట్..!!
hero-vishal-slams-delay-in-vijay-s-cm-oath-questions-governor-s-majority-demand-here-the-details

విశాల్ వ్యాఖ్యల వైరల్

https://twitter.com/VishalKOfficial/status/2052299006546747866

అదే విధంగా ఇప్పుడు తమిళనాడులో కూడా టీవీకే అధినేత విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని విశాల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో 233 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉందని, ఇలాంటి సమయంలో గవర్నర్ పాలన కాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కావాలని విశాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. టీవీకే పార్టీకి దాదాపు మెజారిటీ వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడంలో గవర్నర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని విశాల్ ప్రశ్నించారు. ప్రజల తీర్పుకు గౌరవం ఎక్కడ? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగ హక్కులు రాజకీయ నాయకులకు మాత్రమే కాదని, ప్రజలకు కూడా తెలుసని విశాల్ అన్నారు. విజయ్ తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, తాను కూడా అదే కోరుకుంటున్నానంటూ విశాల్ తన మద్దతు ప్రకటించారు. మరో ప్రముఖ హీరో కమల్ హాసన్ సైతం విజయ్ కు మద్దతుగా ముందుకు వచ్చారు. దీంతో.. సమయం గడుస్తున్న కొద్దీ విజయ కు మద్దతు పెరుగుతోంది. రేపు (శుక్రవారం) విజయ్ ప్రభుత్వం ఏర్పాటు పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+