బంగారం కొనుగోళ్లపై మరో ఛాన్స్

దేశీయ బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరల్లో పెద్దగా మార్పులేవీ కనిపించలేదు. అవి స్థిరంగా కొనసాగుతోన్నాయి. వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. పండుగలు, వివాహాల సీజన్ నేపథ్యంలో కొనుగోలుదారులు నగలు, ఇతర ఆభరణాల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తోన్నారు. ధన్ తెరాస్ నాడు 60,000 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు చోటు చేసుకోవడం దీనికి నిదర్శనం. గత ఏడాదితో పోల్చుకుంటే బంగారం కొనుగోళ్లల్లో 15 నుంచి 20 శాతం వరకు పెరుగుదల కనిపించింది.

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన బెంచ్ మార్క్ రేట్ల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 1,44,129 రూపాయల వద్ద రికార్డయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 1,32,022 రూపాయల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌లో పసిడి రేట్లు స్థిరంగా ఉండటంతో నాణేలు, లైట్‌వెయిట్ జ్యువెలరీ సెట్లు, విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలకు డిమాండ్ బాగా పెరిగింది.

Gold prices in India saw steady offering a fresh chance to buyers planning purchases during festive season

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,340 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,32,250 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,44,129 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,32,022 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,39,910, రూ.1,32,022 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,44,129, 22 క్యారెట్లు రూ. 1,32,022 వద్ద కొనసాగుతున్నాయి.

ధన్‌తేరాస్ ధమాకా: రూ. వేల కోట్లు దాటిన పసిడి కొనుగోళ్లు: గిరాకీ వీటికే
ధన్‌తేరాస్ ధమాకా: రూ. వేల కోట్లు దాటిన పసిడి కొనుగోళ్లు: గిరాకీ వీటికే

పసిడి ధరల్లో స్థిరత్వం ఉన్నప్పటికీ, వెండి ప్రియులకు మాత్రం ఊరట లభించింది. 999 స్వచ్ఛత కలిగిన కిలో వెండి ధర 2.4 శాతం పడిపోయింది. ఒక్కరోజే రూ. 4,430 తగ్గడంతో కిలో వెండి ధర రూ. 1,81,863 కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ తగ్గి రూ. 1,42,364 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ కామెక్స్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,065 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94 రూపాయల కంటే మెరుగుపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+