హైదరాబాద్ కు రాహుల్ గాంధీ, ఖర్గే- కీలక భేటీ.. నిర్ణయాలు..!!

హైదరాబాద్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ తెలంగాణలో ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే అమిత్ షా హైదరాబాద్ లో పాద యాత్ర నిర్వహించారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాగా.. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే హైదరాబాద్ వస్తున్నారు. కీలక సమావేశంలో పాల్గొని.. పార్టీ నేతలతోనూ భేటీ కానున్నారు. దీంతో.. ఇక్కడ నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి.

హైదరాబాద్ మరో కీలక సమావేశానికి వేదికగా నిలుస్తోంది. పలువురు ప్రముఖులు ఈ సమ్మిట్ కు తరలి వస్తున్నారు. హెచ్‌ఐసీసీలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న భారత్‌ సమ్మిట్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సదస్సు జరిగే మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఆయన హాజరై కీలక ఉపన్యాసం చేస్తారని వెల్లడించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో జరగనున్న ఈ సదస్సుకు వంద దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ప్రతినిధుల్లో పారిశ్రామిక వేత్తలతో పాటుగా పలు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అగ్ర నాయకులు ఉన్నారు. ఏఐ, డిజిటల్‌ టెక్నాలజీ, గ్రీన్‌ ఎనర్జీ, ఆర్థికాభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాలు, గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ అనే అంశాలపైన ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
rahul-gandhi-mallikarjun-kharge-to-attend-bharat-summit-2026-in-hyderabad-on-november-14

అగ్రనేతల పర్యటనలు

కాగా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సైతం ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు రానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపైన సమీక్షతో పాటుగా కీలక దిశా నిర్దేశం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబరు రెండో వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. వరంగల్‌ విమానాశ్రయంతోపాటు సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో సుమారు రూ.550 కోట్ల అంచనాతో గిరిజన యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అలాగే, రూ.700కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ప్రధాని ప్రారంభించనున్నారు. రూ. 2,250 కోట్లతో నిర్మించిన వరంగల్‌-కరీంనగర్‌(ఎన్‌హెచ్‌563) జాతీయ రహదారిని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం, వరంగల్‌లో పార్టీ కార్యకర్తలతో నిర్వహించే బహిరంగసభకు ప్రధాని హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. దీంతో.. అగ్ర నేతల పర్యటనలతో తెలంగాణలో కొత్త రాజకీయ వ్యూహాలు ఆసక్తిగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+