దూసుకొస్తున్న మరో అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - తాజా హెచ్చరికలు..!!
ఏపీని వరుస తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఆర్నాబ్, మురుసు తుఫాన్ల నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరోసారి వాతావరణ శాఖ కీలక అప్దేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. ఈ క్రమంలోనే.. తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగు తోంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
వాతావరణ శాఖ మరో కీలక సమాచారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో 13న అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది. అది పశ్చిమ వాయవ్యంగా పయనించి 15 నాటికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించనుందని పేర్కొంది. అయితే ఈ వాయుగుండం బలపడు తుందా..తమిళనాడు తీరం దిశగా వస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే వాయు గుండం గా బలపడిన తర్వాత నైరుతి బంగాళాఖాతంలోకి వచ్చే సమయంలో తమిళనాడు, ఏపీ లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. శనివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక
కాగా.. నవంబర్ 12 నుండి 18 వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ రోజు నుంచి కోస్తాంధ్ర - రాయలసీమ: అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు. అదే విధంగా తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.













Click it and Unblock the Notifications
