"పెద్ది కథ విని మామూలు స్థితికి రావడానికి 25 నిమిషాలు పట్టింది"
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ "పెద్ది" ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. అయితే ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 పెద్ది మూవీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవల గ్రాండ్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ అధికారికంగా ప్రకటించింది. ఇక రిలీజ్ కు కేవలం 25 రోజులే ఉండటంతో పెద్ది టీమ్ ప్రొమోషన్స్ ను స్టార్ట్ చేసింది. అయితే తాజాగా పెద్ది మూవీ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా పెద్ది మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మాట్లాడుతూ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.." పెద్ది కథ విన్నాను. కథ విన్న తర్వాత సాధారణ స్థితికి రావడానికి 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టింది. ఈ సినిమాను అసలు మిస్ కాకూడదని అప్పుడే ఫిక్స్ అయ్యాను.. అని తెలిపారు. అలాగే ఈ మూవీ 70-80 ల విజయనగరం బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని దానికోసం ఏకంగా 24 భారీ సెట్స్ వేసి ఏడాదిపాటు పెద్ది ప్రపంచాన్ని నిర్మించినట్లు వెల్లడించారు.

ఇక పెద్ది మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన చికిరి సాంగ్, రయ్ రయ్ రారా సాంగ్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. పెద్ది సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇక పెద్ది చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్వీన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తెలుగు సీనియర్ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.












Click it and Unblock the Notifications