స్థానిక సంస్థల సీట్ల విషయంలో నో కాంప్రమైజ్, బలం ఉన్న పోటీ చేయాల్సిందే...!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కూటమి పార్టీలు ఈ ఎన్నికల కోసం కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. అటు మాజీ సీఎం జగన్ సైతం స్థానిక ఎన్నికల పైన పార్టీ నేతలకు ఇప్పటిక స్పష్టత ఇచ్చారు. పోటీ పైన తేల్చి చెప్పారు. ఇక.. కూటమిలో మూడు పార్టీలు పోటీ చేసే స్థానాల పైన చర్చ జరుగుతోంది. సమన్వయ కమిటీల్లో చర్చించాలని నిర్ణయించారు. కాగా, ఇదే సమయంలో జనసేన సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్ సీట్ల పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం.. ఎన్నికల సంఘం సమాయత్తం అవుతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ పైన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాగా.. స్థానిక ఎన్నికల్లో కూటమి మూడు పార్టీల సీట్ల పంపకాల పైన చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన సీట్ల షేరింగ్ ఫార్ములా పైన మంత్రి మనోహర్ స్పందించారు. 2024 ఎన్నికల్లో అమలు చేసిన ఫార్ములా ఇప్పుడు ఆమోద యోగ్యం కాదని.. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజీ పడ్డామని గుర్తు చేసారు. పార్టీ బలంగా ఉన్న చోట పోటీ చేసి తీరుతామని స్పష్టం చేసారు. కాగా.. సీఎం చంద్రబాబు సీట్ల షేరింగ్ పైన కూటమిలోని పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారని.. ఎవరూ ఈ అంశం పైన వివాదాలకు అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడవద్దని స్పష్టం చేసారు. ముందుగా మున్సిపల్ ఎన్నికలకు ఒకే విడతలో నిర్వహించేలా రంగం సిద్దం అవుతోంది.

జనసేన బలం ఉన్న చోట పోటీ చేయాల్సిందే
కాగా.. మున్సిపల్ ఎన్నికల తరువాత జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో ప్రత్యక్ష పద్దతిలో మేయర్లు.. మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికకు నిర్ణయించారు. కాగా.. ఈ సీట్ల పంపకాల పైన జనసేన సీనియర్ నేత.. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీలో మీడియాతో ఇష్టాగోష్టిలో స్థానిక ఎన్నికల పైన స్పందించారు. ఈ సారి స్థానిక ఎన్నికల్లో రాజీపడమని తేల్చి చెప్పారు. ఆ విషయాన్నీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారని.. అదే తాము చెబుతున్నామని పేర్కొన్నారు. స్థానికంగా బలం ఉన్న చోట పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేసారు. ఇన్ని ఇస్తాము అన్ని ఇస్తాము అంటే కుదరదని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల పోటీ కీ సంబంధించి కోఆర్డినేషన్ సమావేశం ఇంకా జరగలేదని.. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద బలంగా ఫోకస్ పెట్టారని వివరించారు. కూటమిలో ఉన్నాము కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే తాము స్పందిస్తామని బొలిశెట్టి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications