శృంగారంలో పాల్గొంటే ట్యాక్స్, ఇన్సూరెన్స్, పెన్షన్.. వ్యభిచారానికి చట్టబద్ధత

ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యభిచారం చట్టవిరుద్ధం లేదా రహస్యంగా సాగే వ్యవస్థ. కానీ ఈ దేశ ఆలోచనా దృక్పథం ఇందుకు పూర్తి భిన్నం. జర్మనీ ప్రభుత్వం 2002లోనే వ్యభిచారాన్ని ఒక చట్టబద్ధమైన వృత్తిగా గుర్తిస్తూ కీలక చట్టం తీసుకువచ్చింది. లైంగిక కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, ఆరోగ్య భీమా , పెన్షన్ సౌకర్యాలు, క్రమబద్ధమైన వేతనాలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2017లో 'సెక్స్ వర్కర్ ప్రొటెక్షన్ యాక్ట్' అమలులోకి తెచ్చి, ప్రతీ లైంగిక కార్మికుడు స్థానిక అధికారుల వద్ద నమోదుచేసుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడాన్ని తప్పనిసరి చేశారు.

హ్యాంబర్గ్ 'రీపర్బాన్': ఐరోపాలోనే అతిపెద్ద నైట్‌లైఫ్ హబ్!

జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో ఉన్న 'రీపర్బాన్'వీధి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన రెడ్ లైట్ డిస్ట్రిక్ట్‌లలో ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు వినోదం కోసం వస్తుంటారు. ఈ ప్రాంతంలోని 'హెర్బర్ట్‌స్ట్రాస్' అనే ప్రత్యేక వీధికి ఎంతో చరిత్ర ఉంది. 19వ శతాబ్దం నుంచి ఇక్కడ విండో బ్రోతల్స్ ద్వారా వ్యాపారం సాగుతోంది. ఈ వీధిలోకి 18 ఏళ్ల లోపల ఉన్న మైనర్లకు ప్రవేశంపై కఠినమైన నిబంధనలు ఉంటాయి.

Untold Story of Hamburg Reeperbahn Strict Government Rules in Germany Legal Red Light District
Sex Education: కేంద్రం చారిత్రాత్మక అడుగు! స్కూళ్లు, కాలేజీల్లో ఇక కొత్త సిలబస్
Sex Education: కేంద్రం చారిత్రాత్మక అడుగు! స్కూళ్లు, కాలేజీల్లో ఇక కొత్త సిలబస్

నిబంధనలు.. భద్రతా ప్రమాణాలు!

జర్మనీ సెక్స్ వర్కర్లకు చట్టబద్ధత ఎంత ఉందో, అంతే కఠినమైన రూల్స్ అమలులో ఉంటాయి:

  • కాండమ్ తప్పనిసరి: వినియోగదారులు, వర్కర్లు సురక్షితమైన పద్ధతులను పాటించడం చట్టరీత్యా తప్పనిసరి.
  • పన్నుల వసూలు: ఇతర వ్యాపారాల తరహాలోనే ఇక్కడ లభించే ఆదాయంపై ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది. అంటే శృంగారంలో పాల్గొనాలనుకునే వ్యక్తి అక్కడ నిర్ణయించిన రేటుతో పాటు అదనంగా పన్ను కూడా చెల్లించాల్సిందే
  • సేఫ్టీ బటన్స్: లైంగిక దాడులు లేదా హింసను అరికట్టడానికి బ్రోతల్ హౌస్‌లలో అత్యవసర అలారం వ్యవస్థలు, రక్షణ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎవరైనా మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించిన, వారిని బలవంత పెట్టాలనుకున్నా.. కఠిన శిక్షలు తప్పవు
  • మానవ అక్రమ రవాణాపై నిఘా: చట్టబద్ధమైన వ్యాపారం ముసుగులో ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ లేదా మానవ అక్రమ రవాణా జరగకుండా 'క్రిమినల్ పోలీస్' నిరంతరం సోదాలు నిర్వహిస్తుంది.
గ్రీన్ సెక్స్ కు ఓటేస్తున్న జెన్ జీ - ఎందుకు ట్రెండ్ అవుతుంది?
గ్రీన్ సెక్స్ కు ఓటేస్తున్న జెన్ జీ - ఎందుకు ట్రెండ్ అవుతుంది?

అభివృద్ధి చెందిన దేశాల వ్యూహం!

లైంగిక వృత్తిని నిషేధించడం వల్ల అది అండర్‌గ్రౌండ్ వ్యవస్థగా మారి నేరాలు, దోపిడీ, వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని జర్మనీ భావించింది. అందుకే దీనిని చట్టబద్ధం చేసి, నియంత్రించడం ద్వారా అటు మానవ హక్కులను రక్షించడంతో పాటు, నేరాలను అరికట్టవచ్చని జర్మనీ ప్రభుత్వ విధానం స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+