ఉజ్జయినీ ఆలయం క్యూలైన్ లో భారీగా తొక్కిసలాట: శ్రావణ సోమవారం.. పైగా నాగపంచమి
మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ శైవక్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఉత్తరాదిన శ్రావణ మాసం మూడో సోమవారంతో పాటు నాగపంచమి పర్వదినం కూడా కలిసి రావడంతో స్వామివారి దర్శనానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద భక్తుల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. క్యూలైన్లలో తోపులాట సంభవించింది.
ఈ క్రమంలో కొందరు భక్తులు కిందపడిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఊపిరాడక మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వారిని రక్షించారు. తొక్కిసలాట చోటుచేసుకున్న ప్రదేశం నుంచి క్షతగాత్రులను హుటాహుటిన బయటకు తీసుకువచ్చారు. ప్రథమి చికిత్స అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 15 మందికి పైగా భక్తులను ఆసుపత్రికి తరలించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఈ ఏడాది శ్రావణ సోమవారం, నాగపంచమి కలిసి రావడం అత్యంత అరుదైన విషయంగా భక్తులు భావిస్తారు. దీనికి తోడు శ్రీ మహాకాళేశ్వరుడికి ఊరేగింపు కూడా అదే రోజున నిర్వహించడంతో భక్తుల రద్దీ అంచనాలకు మించి పెరిగింది. రికార్డు స్థాయిలో జనం గుమిగూడడం వల్లే బారికేడ్ల వద్ద ఈ పరిస్థితి తలెత్తిందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.
ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయ మూడో అంతస్తులో వెలసిన నాగచంద్రేశ్వర స్వామి ఆలయం తలుపులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నాగపంచమి రోజున తెరచుకుంటాయి. 24 గంటల పాటు ఆలయం తలుపులను తెరిచే ఉంచుతారు అర్చకులు. మహాకాళేశ్వరుడితో పాటు నాగ చంద్రేశ్వరుడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రత్యేక దర్శనం కోసమే ఈ తెల్లవారు జాము నుంచే ఆలయ పరిసరాల్లో ఇసుకవేస్తే రాలనంత జనప్రవాహం కనిపించింది.
ఈ రాత్రి నాటికి దాదాపు 6.29 లక్షల మందికి పైగా భక్తులు మహాకాళేశ్వరుడు, నాగచంద్రేశ్వరుడిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు వెల్లడించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఆలయం బయట అరకిలోమీటర్ దూరం వరకూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా దర్శనభాగ్యం కలగకపోవడం వల్ల ఆలయ ప్రాంగణంలో భక్తులు బ్యారికేడ్లను ఎక్కడానికి ప్రయత్నించారు.
#WATCH | Madhya Pradesh: Injuries reported after a stampede-like situation among the devotees at Mahakaleshwar Nath Chandreshwar Mandir in Ujjain.
— ANI (@ANI) August 17, 2026
Meenu, mother of a man admitted to hospital says, "This occurred at Harsiddhi Chauraha. He came under a barricade when he was going… pic.twitter.com/cNLuRxWXrO
దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తుల నీడ కల్పించడానికి ఆలయ ప్రాంగణంలో వేసిన తాత్కాలిక టెంట్ కూలిపోయింది. దీంతతో పాటు బారికేడ్లు కూడా పడిపోయాయి. వాటి మధ్య భక్తులకు చిక్కుకున్నారు. తీవ్ర గందరగోళ పరిస్థితి తలెత్తింది. సమాచారం అందిన వెంటనే అదనపు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. బ్యారికేడ్ల మధ్య చిక్కుకున్న వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.
VIDEO | Ujjain, Madhya Pradesh: Heavy rush of devotees at the Shri Mahakaleshwar Jyotirlinga Temple to offer prayers on the occasion of Shravan Somwar and Nag Panchami 2026.
— Press Trust of India (@PTI_News) August 17, 2026
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/aBy0msu81C














Click it and Unblock the Notifications