తెలంగాణాలో ప్రమాదంలో 43లక్షల ఓట్లు.. నోటీసులకు నో 'సర్' అంటే మీ ఓటు గల్లంతే!

తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ తెలంగాణాలో సర్ లో భాగంగా ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు ప్రజల నుండి స్పందన కరువైంది. సర్ కు ఎస్ సర్ అనాల్సిన ఓటర్లు నో సర్ అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్పందించని 43 లక్షల మందికి పైగా ఓటర్లకు తుది జాబితాలో చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

వీరి ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది.. గడువులోగా హాజరు కాని వారు రీషెడ్యూల్ ద్వారా దరఖాస్తు చేసుకుని విచారణకు రావాల్సి ఉంటుంది. లేకుంటే ఆ ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉంది.రాష్ట్రవ్యాప్తంగా 92.88 లక్షల మందికి నోటీసులు రూపొందించగా, 82 లక్షల మందికి అందాయి. వీరిలో 43.98 లక్షల మంది 53 శాతం అంటే సగానికి పైగా ఓటర్లు గడువులోగా గుర్తింపు పత్రాలతో హాజరు కాలేదు.

Telangana voters in risk 43 lakh voters are not responding to SIR notices they may lose their votes

38 లక్షల మంది విచారణకు వచ్చి, వారిలో 27.44 లక్షల మంది పత్రాలు చూపి ఓటు నిలబెట్టుకోగలిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో కూడా 66 వేల మందికి నోటీసులివ్వగా, 96 శాతం మంది స్పందించలేదు. దీంతో సీఎం నియోజకవర్గంలో మరోమారు రీ షెడ్యూల్ ద్వారా విచారణకు హాజరు కావాలి. లేదంటే ఆ ఓట్లు పోయే ప్రమాదం లేకపోలేదు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 19.47 లక్షల మంది ఓటర్లు విచారణకు హాజరు కాలేదు. కుత్బుల్లాపూర్‌లో 2.48 లక్షలు, శేరిలింగంపల్లిలో 2.10 లక్షలు మంది విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నియోజకవర్గాల్లో నోటీసులు అందుకున్న వారు నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.ఓటర్ల అనాసక్తికి కారణాలు ఎన్నో. తల్లిదండ్రుల గుర్తింపు కార్డులు కూడా తీసుకురావాలని చెప్పడం, బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లకుండా ఫోన్ చేయడం, వలస వెళ్లిన వారు అందుబాటులో లేకపోవడం వంటివి ప్రధానమైనవి.

కొన్ని చోట్ల రెండు మూడు గుర్తింపు పత్రాలు అడుగుతున్నారు. ఇంకా ప్రత్యేక సమగ్ర సవరణ క్రింద 10 లక్షల మందికి నోటీసులు అందించాల్సి ఉంది. రీషెడ్యూల్ అవకాశం ఉన్నందున ఓటర్లు వెంటనే స్పందించి తమ ఓటును రక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు స్పందించక పోతే ఓటు పోయాక ఏం చేసినా ఫలితం ఉండదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+