తెలంగాణ కష్టం మెచ్చిన కేంద్రం.. 1,087 కోట్ల నిధుల వరం!

వ్యవసాయ రంగంలో డిజిటల్ సంస్కరణలను వేగవంతం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న 'అగ్రిస్టాక్' కార్యక్రమంలో భాగమైన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేసినందుకు గాను, రాష్ట్రానికి రూ. 1,087 కోట్ల ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసింది.

మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు అందించే ప్రత్యేక ఆర్థిక సహాయ పథకం 'సాస్కి' కింద ఈ నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల భూమి వివరాలను ఆధార్‌తో అనుసంధానించి, ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విశేష కృషి చేశారు. ఉదయం నుంచే గ్రామాలకు వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడుతూ, సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి నమోదు ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు.

Telangana Farmer Registry Centre Rewards Telangana s Farmer Registry Success with 1 087 Crore SASCI Incentive Funds

ఫలితంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల కంటే ముందువరుసలో నిలిచి తెలంగాణ ఈ ఘనతను సొంతం చేసుకుంది.కేంద్రం మంజూరు చేసిన ఈ రూ. 1,087 కోట్ల నిధులను రాష్ట్రంలో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతం, గ్రామీణ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు, గోదాములు మరియు మార్కెట్ యార్డుల ఆధునీకరణ వంటి అభివృద్ధి పనులకు ఈ నిధులు ఎంతో ఊతమిస్తాయి.

ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి కావడం వల్ల రానున్న రోజుల్లో రైతులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి: పీఎం కిసాన్, రైతు భరోసా, పంటల బీమా వంటి పథకాల నిధులు ఎలాంటి సాంకేతిక ఆటంకాలు లేకుండా నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.యూరియా, డీఏపీ వంటి రాయితీ ఎరువులను రైతులు సులభంగా పొందవచ్చు. నకిలీ కొనుగోళ్లు, బ్లాక్ మార్కెటింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది.

తెలంగాణలో కీలక జాతీయ రహదారులపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలో కీలక జాతీయ రహదారులపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

బ్యాంకు పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు వేగవంతం కావడంతో పాటు, కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరకు పంటలు అమ్ముకోవడం మరింత సులభతరం అవుతుంది. డిజిటల్ సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడించడం ద్వారా పారదర్శకత పెరగడమే కాకుండా, కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనపు నిధులు రావడం తెలంగాణ వ్యవసాయ రంగానికి శుభపరిణామంగా నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+