ముద్దు సీన్ అనగానే ఏడ్చేసిన హీరోయిన్.. భయంతో సెట్ వదిలి పారిపోయిన హీరో!

బుల్లితెర ప్రముఖ నటి కనికా మాన్ ఇటీవల బిగ్ బాస్ షోతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందచందాలు, నటనతో కుర్రకారును ఆకట్టుకుంటున్న ఈ భామ, పలు టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటించారు. ఈ క్రమంలో 2022లో విడుదలైన 'రుహానియత్' అనే వెబ్ సిరీస్‌లో నటుడు అర్జున్ బిజ్లానీతో కలిసి ఆమె నటించినప్పటి ఓ ఆసక్తికర సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

'ది ప్యారడైజ్' విడుదలపై కుట్ర? కోర్టును ఆశ్రయించిన నిర్మాతలు!
'ది ప్యారడైజ్' విడుదలపై కుట్ర? కోర్టును ఆశ్రయించిన నిర్మాతలు!

ఆ సిరీస్‌లో వీరిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. ఓ ముద్దు సీన్ చిత్రీకరించే సమయంలో తనకు ఎదురైన వింత అనుభవాన్ని కనికా మాన్ వెల్లడించారు. "సాధారణంగా సెట్‌లో దాదాపు 50 మంది వరకు ఉంటారు. కానీ ఇంటిమేట్ సీన్లు తీసేటప్పుడు చాలా తక్కువ మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. తక్కువ మంది ఉన్నప్పటికీ.. ఆ సీన్ తీసే సమయానికి నేను తీవ్ర భయానికి గురయ్యాను. అకస్మాత్తుగా నాకు ఏదో అయిపోయి బిగ్గరగా ఏడవడం ప్రారంభించాను. ఆ సీన్ చేయడం నా వల్ల కాదని చెప్పేశాను" అని ఆమె వెల్లడించారు.

Kanika Mann Cried During Kissing Scene Arjun Bijlani Panicked and Left the Set Full Details Here

కనికా మాన్ ఉన్న పళంగా ఏడవడం చూసి కో-స్టార్ అయిన అర్జున్ బిజ్లానీ తీవ్రంగా కంగారు పడ్డారు. తానేమైనా తప్పు చేశానా అని భయపడిపోయారు. "అర్జున్ వెంటనే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయ్యారు. 'నేను ఏమీ చేయలేదు కదా, ఈమె ఎందుకు ఏడుస్తోంది?' అని ఆందోళన చెందారు. పరిస్థితి అర్థం కాక కంగారులో ఆయన ఒకసారి సెట్ వదిలి బయటకు వెళ్లిపోయారు" అని కనిక మాన్ చెప్పుకొచ్చారు.

'ది ప్యారడైజ్' మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరలు పెంపు..
'ది ప్యారడైజ్' మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరలు పెంపు..

ఆ తర్వాత అర్జున్ బిజ్లానీ సెట్ సభ్యులతో మాట్లాడి.. "ఆమెకు నచ్చజెప్పండి, నేను చాలా నార్మల్‌గా ఉన్నాను, నా వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగలేదనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారట. దీంతో కనికా మాన్ వెంటనే అర్జున్ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించి ఆయనకు సారీ చెప్పారు. ఆయన ప్రవర్తన వల్ల తాను ఏడవడం లేదని, కేవలం వ్యక్తిగత భయం వల్లే అలా చేశానని స్పష్టం చేయడంతో అర్జున్ ఊపిరి పీల్చుకున్నారు. సీనియర్ నటుడైన అర్జున్ బిజ్లానీతో తనకు ఎలాంటి సమస్య లేదని ఆ తర్వాత ఆమె షూటింగ్ పూర్తి చేశారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+