ఆ కేంద్రమంత్రి అవుట్: యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల నగారా: పోలింగ్, కౌంటింగ్

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లల్లో మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 29న విడుదల కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను అక్టోబర్ 6వ తేదీ లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 16న ఉదయం నుంచి పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కిస్తారు.

సభ్యుల పదవీ కాలం నవంబర్ 25తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అవసరం అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న 10 స్థానాలతో పాటు, ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన దినేష్ శర్మ రాజీనామాతో ఏర్పడిన ఉపఎన్నిక స్థానానికి కూడా పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున స్థానాలకు కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Elections for 12 Rajya Sabha Seats on Oct 16 as UP Uttarakhand and West Bengal Key Dates Declared

ఉత్తరప్రదేశ్ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారిలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేతలు అరుణ్ సింగ్, నీరజ్ శేఖర్, బ్రిజ్‌లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేది, గీతా శాక్యా ఉన్నారు. వీరితో పాటు సమాజ్ వాదీ పార్టీ తరఫున రామ్ గోపాల్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి రామ్‌జీ గౌతమ్ పదవీ కాలం ముగియనుంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.

కేరీర్ లోనే ఎప్పుడూ చేయని రోల్ లో స్టార్ హీరో.. గూస్ బంప్స్ !!
కేరీర్ లోనే ఎప్పుడూ చేయని రోల్ లో స్టార్ హీరో.. గూస్ బంప్స్ !!

యూపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం.. అధికార బీజేపీ ఎనిమిది స్థానాలను మళ్లీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. హర్దీప్ సింగ్ పూరికి రెన్యూవల్ లభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశమౌతోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ ఈసారి రెండు స్థానాలలో విజయం సాధించేందుకు అవసరమైన బలాన్ని కలిగి ఉంది. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ప్రాతినిధ్యం పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది.

బెంగళూరు- అమరావతి వందే భారత్ పై కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన: కుప్పంలో ఈ రైళ్లకు హాల్ట్
బెంగళూరు- అమరావతి వందే భారత్ పై కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన: కుప్పంలో ఈ రైళ్లకు హాల్ట్

మరోవైపు ఉత్తరాఖండ్‌లో బీజేపీ సీనియర్ నేత నరేష్ బన్సాల్ పదవీ కాలం ముగియనుండగా, అక్కడ అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్న అధికార బీజేపీ ఈ స్థానాన్ని సులువుగా నిలబెట్టుకోనుంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన ప్రముఖ నటి రుక్మిణి మల్లిక్ అలియాస్ కోయల్ మల్లిక్ తన సభ్యత్వానికి జూలై 16న రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. శాసనసభ బలాబలాల ప్రాతిపదికన అధికార టీఎంసీ ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోనుంది. ఇక్కడ గెలిచే అభ్యర్థి 2032 ఏప్రిల్ 2 వరకు పదవిలో కొనసాగుతారు.

అక్టోబర్ 16న జరగబోయే ఈ రాజ్యసభ ఎన్నికలు దేశంలో తాజా రాజకీయ సమీకరణాలను ప్రతిబింబించనున్నాయి. ప్రత్యేకించి.. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. శాసనసభల్లో ఉన్న సంఖ్యా బలానికి అనుగుణంగానే ఫలితాలు రానున్న నేపథ్యం పార్టీల భవిష్యత్తు ఎత్తుగడలను తేటతెల్లం చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+