జగన్ తో భేటీ-పొత్తు ? తేల్చేసిన షర్మిల..! అంత ఖర్మ పట్టలేదు..!

ఆస్తి వివాదాల కారణంగా అన్న వైఎస్ జగన్ (YS Jagan) కు దూరమైన వైఎస్ షర్మిల (YS Sharmila) తిరిగి ఆయనకు దగ్గరవుతున్నట్లు, తాజాగా భేటీ అయి చర్చలు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైఎస్ షర్మిల ఇవాళ ఘాటుగా స్పందించారు. తాను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు.. తన మీద సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలే అని ఆమె తేల్చిచెప్పేశారు. చేస్తున్న విశ్లేషణలు పూర్తిగా నిరాధారమన్నారు. జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. ఇవన్నీ గిట్టని వాళ్ళవి పస లేని ఆరోపణలన్నారు.

వైఎస్ షర్మిల కుమార్తె అంజలి పెళ్లి, రిసెప్షన్ డేట్స్ ఫిక్స్-ఎక్స్ లో ట్వీట్..!
వైఎస్ షర్మిల కుమార్తె అంజలి పెళ్లి, రిసెప్షన్ డేట్స్ ఫిక్స్-ఎక్స్ లో ట్వీట్..!

వైఎస్ జగన్ ను కలిసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని తాను చివరిసారిగా కలిసింది తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనే అన్నారు. మళ్లీ ఇప్పుడు కలిసినా.. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే అన్నారు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలను నా బిడ్డ పెళ్లికి రావాలని, దీవించాలని ఆహ్వానిస్తానని, ఇందులో కొత్తేం లేదు .. వింత అంతకన్నా కాదన్నారు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని..తెర వెనుక రాజకీయాలు చేసుకొనే ఖర్మ YSR బిడ్డగా తనకు లేదన్నారు.

YS Sharmila Breaks Silence on Rumours of Meeting Jagan Over Daughter s Wedding
ఊరికే డైలాగులు- మీకు మీరే సర్టిఫికెట్లు..! దమ్ముంటే..? జగన్ ట్వీట్..!
ఊరికే డైలాగులు- మీకు మీరే సర్టిఫికెట్లు..! దమ్ముంటే..? జగన్ ట్వీట్..!


శుభకార్యానికి, రాజకీయానికి లింకులు పెట్టి.. తన విశ్వసనీయతను, రాజకీయ ప్రామాణికతను, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు. తన బిడ్డ వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ.. ఒక్కటి కాబోతున్న నవదంపతులకు హృదయ పూర్వక ఆశీస్సులు అందించాలని వైఎస్ షర్మిల కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+