ఎయిర్‌టెల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్!
భారత ప్రముఖ టెలికాం సేవల సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.999, అంతకంటే ఎక్కువ విలువైన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై యాపిల్‌కు చెందిన ఐక్లౌడ్+తో పాటు యాపిల్ టీవీ, యాపిల్ ఆర్కేడ్ సేవలను అదనపు ప్రయోజనాలుగా ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. వినియోగదారులకు మరింత మెరుగైన డిజిటల్ అనుభవాన్ని, ఎక్కువ ప్రయోజనాన్ని అందించేందుకు ఈ ప్లాన్లను అప్‌గ్రేడ్ చేసినట్లు సంస్థ తెలిపింది.
ఈ కొత్త ఆఫర్ ద్వారా ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు తమ ఫోటోలు, ఫైళ్లు, పాస్‌వర్డ్‌లు, కాంటాక్టులను అత్యంత సురక్షితంగా ఐక్లౌడ్‌లో దాచుకోవచ్చు. దీని ద్వారా కొత్త డివైజ్‌లలోకి డేటాను సులభంగా బ్యాకప్ చేసుకోవడం సాధ్యమవుతుంది. దీనితో పాటు ఎలాంటి ప్రకటనలు లేదా యాప్ కొనుగోళ్లు లేకుండా యాపిల్ ఆర్కేడ్‌లో వందలాది గేమ్స్‌ను ఆడుకోవచ్చు. అలాగే యాపిల్ టీవీ ద్వారా అంతర్జాతీయ స్థాయి వెబ్ సిరీస్‌లు, సినిమాలు, ఒరిజినల్ కంటెంట్‌ను వీక్షించే సౌలభ్యం లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా ముగ్గురు సభ్యులకు అన్‌లిమిటెడ్ డేటా, ఫాస్ట్‌లేన్ టెక్నాలజీ, స్పామ్ ప్రొటెక్షన్‌తో పాటు వినోద రంగానికి చెందిన పలు సబ్‌స్క్రిప్షన్లు అందుతాయి. ఇప్పుడు దీనికి యాపిల్ సేవలు కూడా తోడవడంతో ఒకే ప్లాన్‌లో కనెక్టివిటీ, క్లౌడ్ స్టోరేజ్, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ అన్ని ప్రయోజనాలు లభించనున్నాయి. అర్హత ఉన్న కస్టమర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా గానీ లేదా సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను సందర్శించి గానీ ఈ ప్లాన్లకు అప్‌గ్రేడ్ కావచ్చు.
కస్టమర్ల జీవితాలను మరింత సులభతరం చేస్తూ.. ప్లాన్ల ద్వారా విలువైన ప్రయోజనాలను అందించడమే తమ లక్ష్యమని భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమిత్ త్రిపాఠి వెల్లడించారు. కుటుంబం మొత్తానికి అవసరమైన కనెక్టివిటీ, వినోదం, డిజిటల్ సేవలను ఒకే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కిందకు తీసుకురావడానికే యాపిల్ భాగస్వామ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
