పసికూనపై టీమిండియా విలవిల: టార్గెట్ 32 పరుగులే: అభిషేక్ గోల్డెన్ డక్

ఆసియా గేమ్స్ లో భాగంగా జపాన్ తో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ లో భారత్ తడపాటు ప్రదర్శిస్తోంది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కుప్పకూలింది. 14 పరుగులకే ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్ బ్యాటర్లను కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో పడింది. నిర్ణీత అయిదు ఓవర్లకు ఏకంగా నాలుగు వికెట్లను కోల్పోయి 32 పరుగులు చేసింది భారత జట్టు. శ్రేయాస్ అయ్యర్- 16, తిలక్ వర్మ ఒక పరుగుతో నాటౌట్ గా నిలిచారు.

ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను అయిదు ఓవర్లకే కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. 2.4 ఓవర్లలోనే 14 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను భారత్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. యువ సంచలనం అభిషేక్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరగాడు. ఇది అతనికి గోల్డెన్ డకౌట్. ఎదుర్కొన్న మొదటి బంతికే వికెట్ ను సమర్పించుకున్నాడు.

Sanju Samson Ishan Kisan departs low score and Abhishek Sharma gone for golden duck t20i vs Japan

వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తొమ్మిది పరుగులతో సరిపెట్టుకున్నాడు. మరో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో భారత స్కోరు బోర్డు దారుణంగా దెబ్బతింది. మ్యాచ్ ను కాపాడుకోవాలంటే జపాన్ జట్టును ఈ అయిదు ఓవర్లల్లో అతి తక్కువ పరుగులకే కట్టడి చేయాల్సి ఉంది. శ్రేయాస్ అయ్యర్ 12 బంతుల్లో 16 పరుగులు గనక చేయకపోయి ఉంటే జట్టు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యేది.

ఈ చారిత్రక మ్యాచ్ శనివారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. నగోయాలో కురిసిన భారీ వర్షం కారణంగా గ్రౌండ్ చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ నిర్వహణ ఆలస్యమవడమే కాకుండా, ఓవర్లను భారీగా కుదించారు. ఇరు జట్లకు అయిదు ఓవర్ల చొప్పున ఆడే అవకాశాన్ని కల్పించారు. అయిదు ఓవర్లకే మ్యాచ్ పరిమితం కావడంతో బ్యాటర్లు మొదటి బంతి నుంచే భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు.

టీమిండియా తుదిజట్టులో.. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ ఆడుతున్నారు.

జపాన్ జట్టులో.. లాచ్‌లాన్ యమమోటో లేక్, రియో సకురానో- థామస్, కెండెల్ కడోవాకిఫ్లెమింగ్ (కెప్టెన్), బెంజమిన్ ఇటో విస్, వాతారు మియాచి, అలెగ్జాండర్ షిరాయ్ పాట్‌మోర్, చార్లీ హరా హింజ్, ఇబ్రహీం తకహాషి, డెక్లాన్ సుజుకి మెక్‌కాంబ్, మాకోటో తనియామా, షోమా సుగాయ స్లేటర్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+