ప్రముఖ సోషల్ మీడియా స్టార్ దారుణ హత్య.. ఎవరీ అయేషా గిలానీ?

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్ 28 ఏళ్ల అయేషా గిలానీ(షమ్సు బీబీ) దారుణ హత్యకు గురయ్యారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో దాదాపు 1.3 మిలియన్ల(13 లక్షల) మంది ఫాలోవర్లతో ఆన్‌లైన్లో ఎంతో చురుగ్గా ఉండే అయేషా గిలానీ.. పట్టపగలు కారులో ప్రయాణిస్తుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక సంఘటన పాకిస్తాన్‌తో పాటు సోషల్ మీడియా వినియోగదారులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Husharu Pittalu Movie Review: బోల్డ్ కంటెంట్‌తో మెప్పించిందా? యూత్‌కి కనెక్ట్ అయిందా?
Husharu Pittalu Movie Review: బోల్డ్ కంటెంట్‌తో మెప్పించిందా? యూత్‌కి కనెక్ట్ అయిందా?

ఆగష్టు 14న అయేషా గిలానీకి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఇంటిని విడిచి రావాల్సిందిగా ఆ వ్యక్తి కోరడంతో ఆమె తన 15 ఏళ్ల సోదరి అసిమా, సోదరుడు ఇమాతుల్లాతో కలిసి కారులో బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 30 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వారి కారును అడ్డుకుని కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ బుల్లెట్ నేరుగా అయేషా గిలానీ మెడలోకి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

Pakistan TikToker Ayesha Gilani Shot Dead in Car Who was Shamsoh Bibi Know more about her death details

అయేషా గిలానీ సోదరుడు ఇమాతుల్లా వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడి చేసిన వారి వయస్సు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. దుండగులు అకస్మాత్తుగా కారుపై దాడి చేయగా, ఒక బుల్లెట్ నేరుగా అయేషా మెడలోకి దూసుకెళ్లి ఆమె కారులోనే మరణించింది. కారు అదుపు తప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయేషా 15 ఏళ్ల సోదరి అసిమా తీవ్రంగా గాయపడగా.. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రికి చేరుకున్న అయేషా తండ్రి ఫజల్ సాహిబ్జాదా తన కుమార్తె మృతదేహాన్ని గుర్తించారు.

ఈ సినిమా ఏంటి బాసూ ఇంత బాగుంది..!
ఈ సినిమా ఏంటి బాసూ ఇంత బాగుంది..!

ఈ విషయం డబ్బు లావాదేవీలు, బెదిరింపులకు సంబంధించినదా?
కొంతమంది వ్యక్తులతో తన కుమార్తెకు ఆర్థిక వివాదం తలెత్తిందని ఆయేషా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు ఆయేషాకు పదేపదే ప్రాణ బెదిరింపులు వస్తున్నాయన్నారు. దీనిపై గతంలోనే ఇస్లామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ ఘటన జరిగిన అనంతరం ఇద్దరు అనుమానితులు మోటార్‌సైకిల్‌పై పారిపోతున్న దృశ్యాలున్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు కనుగొన్నారు. ఆ ఫుటేజీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి వారు ఇప్పుడు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

అయేషా గిలానీ ఎవరు?
అయేషా గిలానీ ఓ ప్రముఖ పాకిస్తానీ టిక్‌టాకర్. ఆమె అసలు పేరు షమ్సు బీబీ, టిక్‌టాక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆమెకు దాదాపు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వీడియోలను చాలా మంది ఇష్టపడ్డారు. ఆమె ఆన్‌లైన్‌లో చాలా చురుకుగా ఉండేవారు. ఆమె మరణం ఆమె అభిమానులలో తీవ్ర దుఃఖానికి కారణమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+