చెస్ ఆణిముత్యం కోనేరు హంపి డాట్ కాం
హైదరాబాద్ఃచెస్ ప్రపంచ జూనియర్ చాంపియన్, ఆంధ్రతేజం కోనేరు హంపిపేరిట ఏర్పాటు చేసిన ఓ వెబ్ సైట్ సోమవారం ప్రారంభమైంది. ఓచెస్ ప్లేయర్ పేరిట వెబ్ సైట్ ప్రారంభం కావడం ఇదే ప్రథమం. www.koneruhumpy.com నుఎస్సెల్ సాఫ్ట్ వేర్ సర్వీసెస్ రూపొందించింది. ఫతేమైదన్ గ్రౌండ్స్ లోని శాప్ కమిటీహాల్లో శాప్ అధారిటీ చైర్మన్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.
52 వెబ్పేజీలలో హంపికి చెందిన వంద అపురూప చిత్రాలను ఈసైట్ లో వుంచారు. హంపి జీవిత విశేషాలతో పాటు ఆమె సాధించినవిజయాలను కూడా సైట్ లో పొందు పరచారు. త్వరలో శాప్పేరిట ఓ వెబ్ సైట్ ప్రారంభించనున్నట్లు సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా చెప్పారు. ఈసైట్ లో రాష్ట్రంలోని ప్రముఖ క్రీడా కారుల జీవితివిశేషాలను కూడా పొందు పరుస్తారు. అదే విధంగా జాతీయ క్రీడోత్సవాలు, స్టేడియంలోవివరాలు తెలిపే మరో వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నట్లు ఆయనవివరించారు.