భారత్ తీవ్రవాదులకు లాడెన్ తో లింకు
న్యూఢిల్లీః భారత దేశంలో ముఖ్యంగా కాశ్మీర్ లో మారణహోమం సృష్టిస్తున్న తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ మద్దతు వున్నదని, ఆ సంస్థల ఆస్తులను స్తంభింపచేసి, వాటిని నిర్మూలించాలని భారత్ అమెరికాను కోరింది. కాశ్మీర్ లో సోమవారం జరిగిన దారుణానికి పాక్ స్థావరంగా పనిచేస్తున్న జైషీర్ మహ్మద్ అనే తీవ్రవాద సంస్థ కారణం అని భారత్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఓమర్ ఫరూఖ్ కొత్త ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సంస్ధకు అంతర్జాతీయ తీవ్రవాది బిన్ లాడెన్ తో సంబంధాలున్నాయని ఆయన వెల్లడించారు.
భారతదేశంలోఅరాచకం సృష్టిస్తున్న లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర సంస్థల ఆస్తులనుస్వాధీనం చేసుకొని, వీటిని నామరూపాల్లేకుండా చేయాలని ఓమర్ అబ్దుల్లా అమెరికానుకోరారు.












Click it and Unblock the Notifications
