ఉగ్రవాదంపై భారత్ కు అమెరికా బాసట
వాషింగ్టన్ః భారత్ తో సహా ప్రపంచదేశాలలో ఎక్కడ ఉగ్రవాదం వున్నా దాని పీచమణిచేందుకు సిద్ధంగా వున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అమెరికా అధ్యక్షుడు బుష్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వివరించారు. భారత్ ఎదుర్కొంటున్న తీవ్రవాద సమస్యను పరిష్కరించేందుకు సైతం అమెరికా సహకరిస్తుందని బుష్ హామీ ఇచ్చనట్లు జస్వంత్ చెప్పారు.
అమెరికాపై దాడి చేసిన ఒసామాబిన్ లాడెన్ ఆటకట్టించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ తరువాత భారత్ లో వున్న తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో కూడా అమెరికా సహకరిస్తుందని చెప్పినట్లు జస్వంత్వివరించారు. జస్వంత్ తన అమెరికా పర్యటనలో భాగంగా రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులను కలుసుకుంటారు.
ఇదిలావుండగా మిలిటెంట్లు సోమవారం నాడు కాశ్మీర్అసెంబ్లీపై దాడి చేసి 25 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదం ప్రజాస్వామ్యానికిపెను సవాలుగా పరిణమించిందని అమెరికా వ్యాఖ్యానించింది..












Click it and Unblock the Notifications
