నెలాఖరుకల్లా కాంగ్రెస్ జిల్లాకమిటీలు
హైదరాబాద్‌ః జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులను ఈ నెలాఖరుకల్లా ఎంపిక చేస్తామని పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు వెల్లడించారు. కృష్ణా, చిత్తూరు,విశాఖపట్నం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లా అధ్యక్షులవిషయంలో ఏకాభిప్రాయం సాధించామని ఆయన శుక్రవారంవిలేకరులకు చెప్పారు. ఈ వ్యవహారంపై ఒక నిర్ణయం తీసుకొనేందుకు కొత్తఢిల్లీ నుంచి సోమ, మంగళ వారాల్లోసీనియర్ నేతలు రానున్నట్లు ఆయన చెప్పారు.
ఇప్పటికే ఆలస్యమైన జిల్లా కమిటీలను ఈ నెలాఖరుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని సత్యనారాయణ రావు చెప్పారు. జిల్లా కమిటీల ఎంపిక పూర్తయ్యాక నవంబర్ మొదటి వారం నుంచి ఏలేరు తదితర కుంభకోణాలపై కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు.
సింధియాకు నివాళి
దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ రావు సింధియా కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఘన నివాళుఅర్పించారు. శుక్రవారం గాంధీభవన్ లో ఈ మేరకు సంతాప సభ జరిగింది. సింధియా మరణం రాష్ట్ర కాంగ్రెస్ కు శరాఘాతమని వై.ఎస్. రాజశేఖర రెడ్డి,ఎం. సత్యనారాయణ రావు తదితరులు అన్నారు.












Click it and Unblock the Notifications