హైదరాబాద్లో దావూద్ ముఠాఅరెస్ట్
హైదరాబాద్ : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను శుక్రవారం నాడు హైదరాబాద్ పోలీసులుఅరెస్టు చేశారు. వీరు ముగ్గురూ దావూద్ ప్రధాన అనుచరుడు చోటాషకీల్ కు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఆముధాలను స్మిగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ముంబై నివాసిఅమిన్ యూసఫ్ ఖాన్ (30), హైదరాబాద్ ఛాదర్ఘట్ నివాసి మహ్మద్ అహ్మదుల్లా (25), అజంపురా నివాసి అబ్దుల్ రఫీ మోహజ్జామ్ అలియాస్ ఒబైద్ (20)లైనవీరిని అరెస్టుచేసి వీరి వద్దనుంచి రెండు తుపాకులు, తూటాలనుస్వాధీనపరచుకున్నారు.
కోల్కతా నుంచివీరు తుపాకులను కొనుగోలు చేసి బొంబాయి దావూద్ ముఠాకుఅప్పగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ముంబాయి పోలీసులు దావూద్ ముఠాపై ఉక్కుపాదం మోపడంతోవీరు హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలు చేస్తున్నారు. హవాలా ఆపరేటర్ల ద్వారావీరికి డబ్బు అందేది. ఈ డబ్బుతో వారు కోల్కత్తా చేరుకుని అక్కడి దావూద్ ముఠా సభ్యులైన ఇబ్రహీం అలియాస్ రాజు, జావేద్ల సహాయంతో తుపాకులను కొనుగోలు చేసి, తారిక్పర్వీన్ సూచించిన అందజేసేవారు.
తుపాకులకు చాలా వరకు హైదరాబాద్లోనే ముంబై ముఠా సభ్యులకుఅందించేవారు.ఇటీవల వీరు ఆయుధాల కొనుగోలుకు కోల్కత్తా వెళ్లినపుడు అక్కడి పోలీసులు అహ్మదుల్లా, జావేద్లనుఅరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి లక్షా 40వేల నగదు, 20 తూటాలుస్వాధీన పరచుకున్నారు. ఈ కేసులో బెయిల్ తీసుకుని వచ్చిన అహ్మదుల్లా తిరిగి ఆయుధాలను తీసుకురావటానికి ప్రయత్నిస్తుండగా వారినిఅరెస్టు చేశామని నగర పోలీసు కమీషనర్ పేర్వారం రాములు తెలిపారు.












Click it and Unblock the Notifications
