హంతకుడ్ని పట్టించిన ఆత్మ.. 20 రోజులు వెంటాడి మరీ.. ఏం జరిగింది..?
ముంబైలోని డాంబివ్లి ప్రాంతంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న గొడవ కారణంగా ఓ వ్యక్తి తన స్నేహితుడ్ని చంపేశాడు. ఎవరూ చూడలేదని దర్జాగా ఉన్నాడు. కానీ 20 రోజులుగా మృతుడి ఆత్మ అతడ్న నిద్రపోనివ్వలేదు. చనిపోయిన స్నేహితుడు పీడకలగా వస్తూ టార్చర్ పెట్టసాగాడు. దాంతో ఆ వేదన భరించలేక పోలీసులకు వద్ద వెళ్లి జరిగింది చెప్పాడు. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన అక్టోబర్ 9 న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన డాంబివ్లిలోని మోతాగావ్ అనే ప్రాంతంలో జరిగింది. ప్రభు అనే వ్యక్తి తన క్లోజ్ ఫ్రెండ్ విశాల్ ను చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో హత్య చేశాడు.
ఓ పత్రికా కథనం అందించిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 9 న డాంబివ్లిలోని మోతాగావ్ ప్రాంతంలో రాత్రి సమయంలో విశాల్, ప్రభు మద్యం తాగారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ప్రభు.. విశాల్ పై దాడికి దిగాడు. ఈ దాడిలో విశాల్ మృతి చెందాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని తమ గ్రామపెద్ద అయిన సందేశ్ హత్రే కు తెలిపాడు. ఇక ఆయన సాయంతో శవాన్ని పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత తనను ఎవరూ గుర్తించరని భావించి.. నగరం నుంచి పారిపోయాడు. కానీ ఈ ఘటన జరిగినప్పటి నుంచి ప్రభుకు విశాల్ పీడకలలా వెంటాడుతూ వచ్చాడు.

దాదాపు 20 రోజుల పాటు ప్రభు నిద్రలేక తీవ్రమైన క్షోభను అనుభవించాడు. తన స్నేహితుడు విశాల్ గుర్తుకురావడం.. ఆత్మలాగా తన వెంట పడుతున్నట్లు ప్రవర్తించాడు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. డైరెక్ట్ గా పోలీసులకు వద్దకు వెళ్లి జరిగింది తెలిపాడు. దాంతో పోలీసులు ప్రభును అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులులు ప్రభుతోపాటు అతనికి సహకరించిన గ్రామ పెద్ద సందేశ్ హత్రేను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications
