ఇంద్రయోగంతో ఈ రాశులకు పండుగ, నేడు ఈ రాశులకు దండగ.. మీ రాశిఫలం తెలుసుకోండి!
నవంబర్ 4, 2026 బుధవారం. ఈ రోజు పూర్వఫాల్గుణి నక్షత్రం, బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం ప్రభావం ఉంటుంది. కొన్ని రాశులకు అనుకూలంగా, మరికొన్నింటికి జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. అన్ని 12 రాశుల వారికి రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఇన్నాయి. ఎవరికి కలిసొస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి తెలుసుకుందాం.
మేషం:ఎప్పటి నుండో వసూలు కాని డబ్బు తిరిగి రావచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడులు మానుకోండి. కుటుంబం నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి రావచ్చు. ఎవరైనా తెలివైన వ్యక్తితో కలవడం వల్ల మంచి సలహా దొరుకుతుంది.

వృషభం: ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది. కుటుంబం, స్నేహితుల మద్దతు బాగా ఉంటుంది. డబ్బు విషయంలో కూడా లాభం కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. సాయంత్రం దేవాలయం వెళ్లి ప్రార్థన చేయడం మంచిది.
మిథునం: విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగంలో కొత్త ఆఫర్ రావచ్చు. కుటుంబం పూర్తి సహకారం అందిస్తుంది. స్నేహితులతో బయటకు వెళ్లే ప్లాన్ చేయవచ్చు. సాయంత్రం భక్తి, దేవదర్శనం చేయండి.
కర్కాటకం: కష్టపడితేనే విజయం వరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచండి. వ్యాపారంలో కొంత ఇబ్బంది రావచ్చు. స్నేహితుల సహాయం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
సింహం: అటకెక్కిన డబ్బు వస్తుంది. పెట్టుబడుల్లో లాభం ఉంటుంది. పిల్లలతో సమయం గడపడం సంతోషం ఇస్తుంది. భాగస్వామ్య వ్యాపారం ఉంటే మంచి లాభం వస్తుంది. పెద్ద నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోండి.
కన్య: సింగిల్ అయితే ప్రేమ వ్యవహారం ముందుకు సాగవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగులు, అధికారులతో సంబంధాలు బాగుంటాయి. పెట్టుబడుల్లో లాభం కనిపిస్తుంది. వ్యాపారంలో పెద్ద డీల్ ఫైనల్ కావచ్చు. తల్లిదండ్రుల సేవ చేసే అవకాశం ఉంటుంది.
తులా: స్నేహితులతో బయటకు వెళ్లి సంతోషంగా గడపవచ్చు. ఆరోగ్యం మెరుగవుతుంది. గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే మీ కోసం కూడా కొంత సమయం కేటాయించండి.
వృశ్చికం: చాలా కాలంగా చేయాలనుకున్న పని పూర్తి కావచ్చు. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం, వ్యాపారం సాధారణంగా సాగుతాయి. ప్రేమ జీవితంలో మంచి సమయం ఉంటుంది. సాయంత్రం కుటుంబం లేదా స్నేహితులతో గడపవచ్చు.
ధనుస్సు: స్నేహితుల ద్వారా ముఖ్యమైన వ్యక్తిని కలవడం జరుగుతుంది. వారి సలహా మీ పనికి ఉపయోగపడుతుంది. ప్రేమ జీవితంలో భాగస్వామికి సమయం ఇవ్వండి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. సాయంత్రం కుటుంబంతో గడపండి.
మకరం: ఆరోగ్యం, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. పాత స్నేహితుడు కలవడం సంతోషం ఇస్తుంది. ప్రేమ జీవితంలో మంచి సమయం. పిల్లల వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి అపోహలు రావచ్చు.
కుంభం: చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యుడిని కలవడం జరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. కుటుంబంలో పెళ్లి సంబంధిత విషయాలు ముందుకు సాగవచ్చు. జీవనశైలిని మెరుగుపరచుకోండి. సాయంత్రం కుటుంబంతో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి.
మీనం: ఇంట్లో అతిథులు రావచ్చు. డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండవచ్చు. ఉద్యోగంలో ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. వ్యాపారంలో లాభం కనిపిస్తుంది. సాయంత్రం స్నేహితుడితో గడపవచ్చు.
ఈ రోజు మొత్తంగా చూస్తే కొన్ని రాశులకు డబ్బు, అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. మిగతా వాళ్లు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నేడు అన్ని రాశులవారు రోజును సానుకూలంగా ప్రారంభించండి.













Click it and Unblock the Notifications
