హైదరాబాద్‌ లో వాటర్ సంక్షోభం.. కాలేజీలకు ముందుగానే దీపావళి సెలవులు

హైదరాబాద్ లో ప్రస్తుతం నీటి కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ లోని పలు కాలేజీలు, హాస్టల్స్ కు ముందుగానే దీపావళి సెలవులు ప్రకటిస్తున్నారు. దాంతో విద్యార్థులతో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నీటి ఎద్దడి కారణంగా మాదాపూర్, హైటెక్స్ పరిసరాల్లోని నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల హాస్టళ్లకు ముందుగానే దీపావళి సెలవులు ప్రకటించినట్లు విద్యార్థులు తెలిపారు. మరోవైపు విద్యార్థులకు సెలవుల సమయంలో చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆన్‌ లైన్ ద్వారా తరగతులు నిర్వహించనున్నట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి.

ఈ మేరకు మంగళవారం సాయంత్రం నుంచి విద్యార్థులు సొంతూళ్లకు బయలుదేరడం స్టార్ట్ చేశారు. దాంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. సాయంత్రం సాధారణంగా ఈ స్టేషన్లలో ఐటీ ఉద్యోగులతో కిక్కిరిసిపోతుంది. ఇప్పుడు విద్యార్థులు కూడా తోడు కావడంతో మెట్రోలో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అలాగే టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ ఫారమ్‌ ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వేలాది మంది విద్యార్థులు ఉండే రెసిడెన్షియల్ క్యాంపస్‌ లలో రోజువారీ అవసరాలకు సరిపడా నీరు అందకపోవడంతో ముందుగానే విద్యార్థులకు దీపావళి సెలవులు ప్రకటించాయి యాజమాన్యాలు. ఈ మేరకు అధికారికంగా సర్క్యులర్ జారీ చేశాయి.

Hyderabad water shortage colleges granted early Diwali holidays heavy crowds seen at metro stations

అయితే విద్యార్థుల అకాడమీస్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దీపావళి పండగ ముగిసేంత వరకూ రోజూ ఆన్‌ లైన్ విధానంలో రెగ్యులర్ క్లాసులు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యార్థులంతా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఇక క్యాంపస్‌ లు తిరిగి ఎప్పుడు తెరుస్తారన్న విషయంపై దీపావళి పండుగకు ముందే తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామని కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+