పాక్‌లో కూలిన అమెరికా హెలికాప్టర్
ఇస్లామాబాద్: అమెరికా హెలికాప్టర్ పాకిస్థాన్‌లో కూలిపోయింది. దీంతోఅందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అమెరికా సైనికాధికారులు మరణించారు.అఎn్ఘానిస్థాన్‌పై చేస్తున్న పోరుకు సహకరించడానికి ఈ హెలికాప్టర్ పాకిస్థాన్‌లో వుంది.
మూడు విమానాశ్రయాలను అమెరికా బలగాలు వాడుకోవడానికి పాకిస్థాన్ అనుమతించింది.అఎn్ఘానిస్థాన్ సరిహద్దుకు సమీపంలో వున్న పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్లో ఈ హెలికాప్టర్ కూలిపోయింది.
హెలికాప్టర్‌ను తామే కూల్చివేశామని తాలిబాన్ ప్రకటించుకున్నట్లు ఆల్ జజీరా టెలివిజన్ నెట్వర్క్ చెప్పింది. హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనలో మరి కొంత మంది గాయపడ్డారు. అయితేవీరి సంఖ్య ఎంత అన్నది తెలియడం లేదు.
తమ దేశ సైనికాధికారుల మృతికి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సంతాపం ప్రకటించారు. వారి మృతి వృధా కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
