అమెరికా హెలికాప్టర్ కూల్చాంః తాలిబన్
ఇస్లామాబాద్ః ఆమెరికా హెలికాప్టర్ ఒకదానిని కూల్చివేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్సేనలు ప్రకటించుకున్నాయి. హెలికాప్టర్ లో వున్న ఇద్దరు అమెరికా వైమానిక దళ సిబ్బంది మరణించారని తాలిబన్సేనలు శనివారం వెల్లడించాయి.
తాలిబాన్సేనల చేతిలో దెబ్బతిన్న హెలికాప్టర్ పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయిందని ఆఫ్ఘనిస్తాన్ సహాయరాయబారిషహీన్ చెప్పారు. అయితే అమెరికా కధనం వేరుగా వుంది. ఆపరేషన్ ఎండ్యూర్ ఫ్రీడంలో సహకరిస్తున్న హెలికాప్టర్ ఒకటి ప్రమాదవశాత్తు కూలిపోవడంతో ఇద్దరు అమెరికాసైనికులు మరణించినట్లు అమెరికా చెబుతున్నది. పాకిస్తాన్ కూడా అమెరికాకు వంత పాడింది. అయితే తాలిబాన్సేనలు మాత్రం ఇది తమ మొదటి విజయంగా చెప్పుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికాసేనల సమాధులు కడతాం అని తాలిబన్లు శపథం చేశారు.












Click it and Unblock the Notifications
