ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం
హైదరాబాద్ః సుమారు 60 డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసి కార్మికులు శనివారం నాడు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ప్రతిపక్షాలు కూడా ఆర్టీసీతో కదం కలపడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది. ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యామ్మాయ ఏర్పాట్లు ఏ మాత్రం సరిపోక పోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.
సమ్మె ఉదృతం కావడంతో పలు ప్రాంతాలలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కర్నూలు, తిరుపతిలో ఆర్టీసీ కార్మికులుపెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రాజమండ్రిలో ఆర్టీసీ వాహనాలను అడ్డుకున్న కార్మికులను పోలీసులు చెదర గొట్టారు. కార్మికులకు మద్దతు ఇస్తున్న కడియం ఎమ్మెల్ల్యే జక్కంపూడి రామ్మోహన్ రావును పోలీసులుఅరెస్టు చేశారు.
భారీ నష్టం - సమ్మె ఆపండిః బాబు
సమ్మె కారణంగా భారీ నష్టం, అసౌకర్యం కలుగుతున్నాయని, తక్షణం సమ్మెకుస్వస్తి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పిలుపునిచ్చారు. సమ్మెను ఎగదేసే వారు రేపు ఆర్టీసీ సిబ్బందిని ఆదుకోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను చాలా వరకు పరిష్కరించిందని బాబు అన్నారు. మొండిపట్టు వీడి కార్మికులు సమ్మెవిరమించాలని ఆయన కోరారు.
ఇది ప్రైవేటీకరణ పథంః రోశయ్య
ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించేందుకే ప్రభుత్వం సమ్మెను పరిష్కరించడంపై ఉపేక్ష చూపుతున్నదని కాంగ్రెస్ నేత రోశయ్యవిమర్శించారు. తమ ప్రభుత్వం హయాంలో 120 కోట్లు రూపాయల లాభాలతో నడుస్తున్న ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల పాలు కావడంపై చంద్రబాబు ప్రజలకు సంజాయీషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
సమ్మె భేరి ఆగదుః సిపిఎం
ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు తీర్చే వరకు సమ్మె ఆగదని సిపిఎం నేత బి.వి. రాఘవులు అన్నారు. సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ లో ధర్నా నిర్వహించేందుకు సిపిఎం చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రైవేటు వాహన దారులు మద్దతు ఇవ్వాలనికోరారు. ప్రైవేటు వాహనాలు నడపడం వల్ల కార్మికుల సమ్మె నీరుకారిపోతున్నదని ఆయన అన్నారు.
బాబు వ్యాఖ్యలకు సిపిఐ ఖండన
ఆర్టీసీ సమ్మెను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలను సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి ఖండించారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను సత్వరం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
