షార్జాలో అబూ సలెంఅరెస్టు
ముంబాయిః మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజం అబూ సలెం అన్సారీని షార్జా పోలీసులు అరెస్టు చేశారు. గుల్షన్ కుమార్ హత్య కేసులో ప్రధాననిందితుడైన అబూ కోసం ముంబాయి పోలీసులు గాలిస్తున్న విషయం విదితమే. షార్జాలో అరెస్టయిన వార్త తెలిసిన వెంటనే ముంబాయి పోలీసులు అబూసలెంను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ అవి ఫలించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
గుల్షన్ కుమార్ హత్య తర్వాత దుబాయి పోలీసులు అబూసలెంనుఅరెస్టు చేసి మూడు నెలల పాటు నిర్బంధంలో వుంచారు. అయితే పాకిస్తానీ జాతీయునిగాఅక్వీల్ ఖాన్ పేరుతో చలామణిలో వున్న కారణంగా ఆయన్ను పోలీసులు కరెక్టుగా గుర్తించలేకపోయారు. భారత ప్రభుత్వం ఎంతలా వత్తిడి తెచ్చినప్పటికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద దుబాయి ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ సారి కూడ అబూసలెం మారుపేరుతోనేఅరెస్టయినట్టుగా తెలుస్తున్నది. ముంబాయి పేలుళ్ల కేసుతో సహా అనేక నేరలతో సంబంధం వున్న అబూసలెం కోసం చాలాకాలంగా ముంబాయి పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా పలుకేసుల్లో గల్ఫ్‌లోఅరెస్టయిన నిందితులను ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన వారినిస్వదేశానికి రప్పించడంలో భారత్ ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో అబూసలెంను ఈ సారి కూడా గల్ఫ్ దేశం భారత్‌కు అప్పగించడం అనుమానమేననిఅంటున్నారు.












Click it and Unblock the Notifications