రైలు ఢీకొని కాంగ్రెస్ నేత మృతి
హైదరాబాద్‌ః హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎస్ పాండురంగారావు రైలు ఢీకొన్న సంఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన పాతబస్తీలోని ఉప్పుగూడ ప్రాంతంలో జరిగింది. చత్రినాకలో నివసించే పాండురంగారావు ఉదయం 6 గంటల ప్రాంతంలో వాకింగ్‌కోసం బయటకు వెళ్లారని ఆ తర్వాత గంట తర్వాత ఆయన రైలు కింద పడి మరణించినట్టుగా చెబుతున్నారని ఆయన సహచరులు అంటున్నారు.
ఈ మృతిపై కాంగ్రెస్ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుండగా పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగివుంటుందనిఅంటున్నారు. రైలు పట్టాల మధ్య వాకింగ్ చేస్తుండగా బహుశ వెనకనుంచి వస్తున్న బెంగుళూర్‌ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టి వుంటుందని వారు చెబుతున్నారు.
పాండురంగారావు మరణ వార్త తెలిసిన వెంటనే మంత్రి కృష్ణయాదవ్, మాజీ మంత్రి హనుమంతరావుఅసిఫ్ నగర్ ఎమ్మెల్యే నాగేందర్, పిజెఆర్ అక్కడికి చేరుకున్నారు. నాయకులంతా వచ్చిన రెండు గంటలకు గానీ పోలీసులు సంఘటన స్థలానికి రాలేదు. దీనిపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు పోలీసులపై విరుచుకుపడ్డారు. పాండురంగారావు మృతికి రియల్‌ఎస్టేట్ మాఫియా కారణమని ఆరోపణలువినవస్తున్నాయి.












Click it and Unblock the Notifications