ఫైనల్లో భారత్
పార్ల్‌ః కెన్యాపై సాధించిన ఘనవిజయంతో ముక్కోణపు వన్డే సిరీస్ అడుగుపెట్టింది. బుధవారం నాడు కెన్యాతో జరిగిన ఆఖరి లీగ్ మాచ్‌లో భారత స్టార్ ఆటగాళ్లు సచిన్, గంగూలీ చెలరేగి ఆడి కొత్త రికార్డులు సృష్టించారు.
ఈ ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం మాత్రమే కాకుండా తొలివికెట్‌కు 258 పరుగులు సాధించి కొత్త ప్రపంచరికార్డు నెలకొల్పారు. భారత్ 50 ఓవర్లలో మూడువికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. కెన్యా 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి కేవలం 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో భారత్ 196 పరుగుల భారీ తేడాతోవిజయం కైవసం చేసుకున్నది.
ఈ మ్యాచ్‌లో సచిన్ వన్డేల్లో తన 31వసెంచరీని నమోదు చేశారు. గంగూలీ వన్డేల్లో 18వసెంచురీ పూర్తి చేశారు. వీరి తర్వాత వచ్చిన వీరేంద్రసెహవాగ్ శివమెత్తి ఆడి 23 బంతుల్లో 55 పరుగులు చేయడంతో భారత స్కోర్ అమాంతంగాపెరిగిపోయింది. శుక్రవారం నాడు టైటిల్ కోసం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది.












Click it and Unblock the Notifications