నవంబర్‌లో బ్లెయిర్‌తో వాజ్‌పేయి భేటీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి నవంబర్‌లో బ్రిటిష్ ప్రధాని టోని బ్లెయిర్‌ను కలుసుకుంటారు. అమెరికా, రష్యా ప్రభుత్వాధినేతలతో మాట్లాడిన తర్వాత వాజ్‌పేయ్ టోనీ బ్లెయిర్‌తో చర్చలు జరుపుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు.
ఐక్య రాజ్యసమితి జనరల్‌అసెంబ్లీకి వెళ్లే వాజ్‌పేయి దేశంలోని ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తగిన బలాన్ని సమకూర్చుకోవడానికి దౌత్యపరమైన చర్యలకు పూనుకుంటారని ఆ అధికారులు చెప్పారు.
ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 10వ తేదీన జరుగుతుంది. దీనికి ముందు వాజ్‌పేయి రష్యా పర్యటన జరుపుతారు. నవంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు ఆయన రష్యా పర్యటన చేస్తారు. ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడువ్లాదిమీర్ పుతిన్‌తో చర్చలు జరుపుతారు. అంటే, నవంబర్ 9వ తేదీన అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో చర్చలు జరపడానికి ముందే రష్యా అధ్యక్షుడితో భారత ప్రధాని చర్చలు జరుపుతారు.
నవంబర్ 10వ తేదీన ఐక్య రాజ్య సమితి జనరల్‌అసెంబ్లీలో పాల్గొని వాజ్‌పేయి స్వదేశానికి తిరుగు ముఖం పడతారు. మార్గ మధ్యంలో లండన్‌లో ఆగి టోనీ బ్లెయిర్‌నుకలుసుకుంటారు.
మూడు ప్రధాన దేశాల అధినేతలతో వాజ్‌పేయి కాశ్మీర్ గురించే ప్రధానంగా మాట్లాడవచ్చునని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications