సత్యం లాభాల్లో భారీగా వృద్ధి
హైదరాబాద్‌ః సత్యం కంప్యూటర్స్ ఈ ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి బ్రహ్మాండమైన ఫలితాలను ప్రకటించింది. క్రితం సంవత్సరం ఇదే మూడు నెలలకాలంతో పోలీస్తే నికరలాభం 100 శాతం పెరిగుదలతో 134.06 కోట్ల రూపాయలు వుంది.
బుధవారం నాడు జరిగిన బోర్డు సమావేశం 25 శాతం మధ్యంతర డివిడెండ్ కూడా ప్రకటించింది. ఈ ఏడాది మూడు నెలల్లో స్థూల రాబడి 453.50 కోట్ల రూపాయల వుంది. ఈ మొత్తంలో ఇతర ఆదాయం 26.87 కోట్ల రూపాయలు కాగా సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ద్వారా లభించిన రాబడి 418.81 కోట్ల రూపాయలు వుంది. దేశీయ అమ్మకాల నుంచి 7.82 కోట్ల రూపాయలు లభించింది. 2 రూపాయల ముఖవిలువ గల షేరు పై ఇపిఎస్ 4.68 రూపాయలు వుంది.












Click it and Unblock the Notifications