మదర్సాలో స్థానే మంచి స్కూళ్లు
న్యూయార్క్‌ః అమెరికా నుంచి భారీ మొత్తంలో అందుతున్న ఆర్ధిక సహాయాన్ని ఆయుధాల కొనుగోలుకు పాకిస్తాన్ వెచ్చించదని అమెరికా స్పష్టం చేసింది. అఎ్ఘాన్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు ఐక్యరాజ్య సమితి మార్గదర్శకత్వంలో జరుగుతుందని అమెరికా పేర్కొంది.
ఈవిషయంలో పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఏ ఒక్క దేశం ప్రధాన పాత్ర పోషించే అవకాశం లేదని అమెరికా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వున్న వేలాది మదర్సాల (మతవిద్యా కేంద్రాలు) స్థానే ఆధునిక పాఠశాలనను నిర్మించాలని పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ యోచిస్తున్నారని అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ చెప్పారు.
తమ దేశ బాలలను 21వ శతాబ్దానికి అనుగుణంగా తయారు చేయాలని ముషారఫ్ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్‌లో ఇండియా కాకస్ గ్రూప్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈవివరణ ఇచ్చారు. అమెరికాకు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగాఈ మదర్సాలు అసత్యాలను ప్రచారం చేస్తూ, విద్యార్ధులను రెచ్చగొడతున్నాయని ఇండియా కాకస్ గ్రూప్ ఆరోపించింది.












Click it and Unblock the Notifications