రాష్ట్రాలపై విద్యాసాగర్ మండిపాటు
హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. తీవ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా ఖర్చు చేయడం లేదని ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో విమర్శించారు. కేంద్రం వేయి కోట్ల రూపాయలు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వాలు అందులో 20 శాతం మాత్రమే ఖర్చు చేశాయని ఆయన అన్నారు. ఈ విషయమై ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఇది వరకే మందలించారని ఆయన చెప్పారు.
కేంద్ర నిధులను ఖర్చు చేసి పోలీసులకు అధునాతన ఆయుధాలను సమకూర్చడంలో, పోలీసులకు అత్యధునాత పద్ధతులపై శిక్షణ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వాలువిఫలమయ్యాయని ఆయన అన్నారు. అత్యధునాతన ఆయుధాలు, శిక్షణ లేని పోలీసులు తీవ్రవాదులను ఎలా ఎదుర్కోగలరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను నిస్సహాయులను చేసి తీవ్రవాదులను ఎదుర్కోవాలని చెప్పడం సమంజసం కాదని ఆయన అన్నారు.
దేశంలోని ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని ఆయన చెప్పారు. ఇస్లాం, తీవ్రవాదం రెండు వేర్వేరనేవిషయాన్ని భారతదేశంలోని ముస్లింలు గుర్తించాలని ఆయనవిజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications