వైభవంగా దసరా వేడుకలు
హైదరాబాద్‌ః రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు శుక్రవారం నాడు వైభవంగా దసరా వేడుకలను జరుపుకున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లోని అమ్మవారి ఆలయాల్లో వైభవంగా పూజలు నిర్వహించారు. దేవాలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనాలకు బారులు తీరారు.
ప్రాంతాలు, సంస్కృతుల ప్రకారం ప్రజలు పండుగను ఆచరించారు. గుజరాతీ, రాజస్తానీ ప్రజలు దండియా నృత్యాలు పండగకు కొత్త శోభను తెచ్చాయి.విజయవాడలో ఇంద్రకీలాద్రి పై దుర్గాదేవి ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వేల సంఖ్యలో భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తిరుపతి,శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ, వంటి తీర్ధ స్థలాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ వేడుకగా పండుగ జరిగింది.












Click it and Unblock the Notifications