అమెరికాకు మశూచి భయం
వాషింగ్టన్‌ః అంత్రాక్స్ భయంతోనే అల్లాడుతున్న అమెరికాను ఇప్పుడు మశూచి కలవరపెడుతున్నది. దాదాపు కొద్ది సంవత్సరాల క్రితమే మశూచిని వాక్సినేషన్స్‌తో ప్రపంచం నుంచి తుడిచిపెట్టి మానవాళిని కాపాడగలిగామని సంతోషిస్తున్న వైద్యలోకాన్ని మశూచి మరోసారి భయపెడుతున్నది.
చాలా ఏళ్లుగా మశూచి ప్రమాదం లేకపోవడంతో దీనికి సంబంధించిన వాక్సిన్‌ను కూడాపెద్దగా ఉత్పత్తి చేయడం లేదు. ముందుజాగ్రత్త చర్యగా మశూచి వాక్సిన్ వేయడం ఇప్పుడే మొదలుపెట్టాలా లేక మశూచి వైరస్‌ను కూడా టెర్రరిస్టులు ప్రయోగిస్తున్నారని వెల్లడయిన తర్వాత వాక్సినేషన్ ప్రారంభించాలా నిర్ణయించలేక అమెరికా ప్రభుత్వం సతమతమవుతున్నది. మశూచి త్వరగా వ్యాపించే అవకాశం వున్న కారణంగా దీనినే జీవాయుధంగా టెర్రరిస్టులు ప్రయోగించే అవకాశం వున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications