పులివెందుల కేసులో జగన్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు..!
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కు (YS Jagan) ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ధర్నా చేసినందుకు పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసుల్ని క్వాష్ చేయాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ సాయంత్రం కీలక తీర్పు ఇచ్చింది. ఆయనపై తదుపరి చర్యల్ని నిలిపేస్తూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార కూటమి వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్ లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంది. దీంతో వారికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే అయిన వైఎస్ జగన్ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. దాన్ని ఉల్లంఘించి బహిరంగ ప్రాంతాల్లో ధర్నాకు దిగిన వ్యవహారంపై పోలీసులు స్పందించారు. జగన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిరసన తెలిపినందుకు తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి చర్యలు అన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ అనంతరం హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
