తాలిబన్ సేనలపై బాంబుల వర్షం
ఇస్లామాబాద్‌ః తాలిబన్ స్థావరాలపై అమెరికా శుక్రవారం నాడు క్లస్టర్ బాంబులనుప్రయోగించింది. కాందహార్ పై వైమానిక దాడులను ముమ్మరం చేశారు.
మరో వైపు నార్తర్న్ అలయెన్స్ కూడా క్రమంగా మజారే షరీఫ్ వైపు చొచ్చుకుని పోతున్నది. కాబూల్ ఉత్తర ప్రాంతంలో భారీ సంఖ్యలో తాలిబన్‌సేనలు వున్న విషయం గమనించిన అమెరికన్‌సేనలు తమ దాడులను అక్కడే కేంద్రీకరించాయి. ఎఫ్-18,ఎఫ్-16 యుద్ధవిమానాలు నిర్విరామంగా తిరుగుతూ బాంబులు గుప్పిస్తున్నాయి. అత్యంత విధ్వంసకరమైన క్లస్టర్ బాంబులను అమెరికా జారవిడుస్తుండటంతో భూతలంపై నష్టం తీవ్రంగా వున్నట్టు చెబుతున్నారు.
మజారే షరీఫ్ వైపు దూసుకుపోతున్న నార్తర్న్‌సేనలకు మద్దతుగా రష్యా పెద్దఎత్తున ట్యాంకులు, ఇతర ఆయుధాలు సప్లయ్ చేస్తున్నది.బ్రిటన్ కూడా తమ రాయల్ మైరెన్ కమెండోలను అమెరికాసేనలకు మద్దతుగా అఎn్గానిస్తాన్‌కు పంపిస్తున్నట్టుగా వెల్లడించింది. 600 మంది రాయల్ మెరైన్ కమెండోలు ప్రస్తుతం ఒమన్ వద్ద వుంది. ఇదిలా వుండగా గురువారం నాడు అమెరికా వేసిన బాంబులు ఒక బస్సుపై పడటంతో బస్సులోని 50 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారని తాలిబన్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications