అబూ సలెం అరెస్టు కాలేదు: సిబిఐ
న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ అబూ సలెంఅరెస్టయ్యాడనే వార్తలో నిజం లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) స్పష్టం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఏ ఎమిరేట్స్‌లో గానీ, మరెక్కడ గానీ అటువంటిఅరెస్టు జరగలేదని సిబిఐ అత్యున్నత వర్గాలు చెప్పాయి. అబూ సలెం మాఫియా లీడర్ దావూద్ ఇబ్రాహీం అనుచరుడు.
అబూ సలెంఅరెస్టు సంబంధించిన సమాచారం అడిగినప్పుడు ఇంటర్‌పోల్ నుంచి శనివారం ఉదయం అటువంటిఅరెస్టు ఏదీ జరగలేదని సిబిఐ సమాధానం వచ్చింది. ఇంటర్‌పోల్ సమాధానంతో అబూ సలెంఅరెస్టు గురించి మూడు రోజులుగా చెలరేగుతున్న ఊహాగానాలకు తెరపడిందని సిబిఐ వర్గాలన్నాయి.












Click it and Unblock the Notifications