అంటరానితనానికి వ్యతిరేకంగాజన్మభూమి
హైదరాబాద్: అంటరానితనానికి వ్యతిరేకంగా జన్మభూమిలోపెద్ద యెత్తున కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు జిల్లా అధికారులనుఆదేశించారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే జన్మభూమిలో అస్పృశ్యతకు వ్యతిరేకంగాపెద్ద యెత్తున కార్యక్రమాలు చేపట్టాలనిఆయన సూచించారు. జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి శనివారం వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నవంబర్ ఒకటవ తేదీనుంచి అస్పృశ్యతకు వ్యతిరేకంగా జరిగేకార్యక్రమంలో పెద్ద యెత్తున పాలు పంచుకోవాలనిఆయన అధికారులకు సూచించారు.
ఇందుకుగాను 152.5 కోట్లరూపాయలు అదనంగా కేటాయించినట్లు ఆయన తెలిపారు.రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలోపాల్గొనాల్సిందిగా ఆయన అన్ని పార్టీలను కోరారు. ఈకార్యక్రమంలో ప్రగతిశీల సామాజికసంస్థలను, ప్రభుత్వేతర సంస్థలనుభాగస్వాములను చేయాలని కూడా ఆయనసూచించారు. ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయిలో సర్పంచ్ నేతృత్వంవహిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications