పోరాడకనే ఓడిన భారత్
డర్బన్‌ః వరుసగా తొమ్మిదో సారి టైటిల్ వేటలో భారత్ చతికిల పడింది. వరుసగా తొమ్మిదో సారిఫైనల్ లో భారత్ క్రికెట్ జట్టు ఘోరపరాజయాన్ని చవి చూసింది. గంగూలీ బృందం ఘనవిజయం సాధించి భారత క్రికెట్ అభిమానులకువిజయదశమి గ్రీటింగ్స్ చెబుతుందనే ఆశలు అడియాశలయ్యాయి. శుక్రవారం డర్బన్ లో జరిగిన ట్రయాగ్యులర్ సిరీస్‌ఫైనల్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలయింది.
తొలుతటాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు దించిన షాన్ పోలాక్ వ్యూహం ఫలించింది. పది బంతులుమిగిలి వుండగానే భారత్ 183 పరుగులకు ఆలౌట్‌అయింది. గంగూలీ బాధ్యతారహితం అయిన షాట్ కొట్టి ఏడు పరుగులకే అవుటవ్వగా, సచిన్ కూడా రెండంకెలకు చేరకుండానేపెవిలియన్ దారి పట్టాడు. భారత్ నుంచి హుటాహుటిన సౌతాఫ్రికా వచ్చిన లక్ష్మణ్ కూడా ఐదు పరుగులకే అవుటయ్యాడు.
మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ 77 పరుగులు,సెహవాగ్ 33 పరుగులు సాధించి భారత్ పరువు దక్కించారు.తక్కువ స్కోరుతో లక్ష్యంలో దిగిన సౌతాఫ్రికా నాలుగువికెట్లు కోల్పోయి 8 ఓవర్లు మిగిలి వుండగానే విజయభేరి మోగించింది. సచిన్ కు రెండువికెట్లు, కుంబ్లేకు రెండి వికెట్లు లభించాయి. అత్యద్భుత ప్రతిభ కనబరచిన సౌతాఫ్రికా కెప్టెన్ షాన్ పోలాక్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications