ఇద్దరు హైదరాబాదీలపై ఆధారాలు:ఎఫ్‌బిఐ
వాషింగ్టన్: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై సెప్టెంబర్ 11వ తేదీన దాడి జరిగిన మర్నాడుఅరెస్టయిన ఇద్దరు హైదరాబాదీలకు విమానం హైజాకర్లతో సంబంధాలున్నట్లు తాత్కాలికంగా నిర్ధారణకు వచ్చినట్లు డల్లాస్ మార్నింగ్ న్యూస్ రాసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) అధికార వర్గాలను ఉటంకిస్తూ హైజాక్‌అయిన విమానాల్లో ఒక విమానం హైజాక్ చేసిన వారితో ఈ ఇద్దరికి సంబంధాలున్నట్లు తాత్కాలిక నిర్ధారణకు వచ్చినట్లు ఆ పత్రిక రాసింది.
హైజాకర్లతో వీరిద్దరికి సంబంధాలున్నాయన్న సాక్ష్యాలను తాముసేకరిస్తున్నామని, వీరిని అనుమానించడానికి తగిన ఆధారాలు లభించాయని ఎఫ్‌బిఐ అధికారులన్నట్లు ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications